Rajkumar Periyasamy | అది సీక్వెల్ కాదు, అక్కడితోనే క్లోజ్.. ధనుష్ ‘ఓం’ సినిమాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
Rajkumar Periyasamy | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓం - చాప్టర్ 1(OM - Chapter 1). ‘అమరన్’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Director Rajkumar Periyasamy | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓం – చాప్టర్ 1(OM – Chapter 1). ‘అమరన్’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి వెల్లడించిన ఆసక్తికరమైన విషయాలు సినిమాపై మరింత హైప్‌ను పెంచుతున్నాయి.
‘ఓం’ చాప్టర్ 1, చాప్టర్ 2 సినిమాల మధ్య ఎలాంటి సంబంధం లేదని దర్శకుడు స్పష్టం చేశారు. ఈ సినిమా టైటిల్లో ‘చాప్టర్ 1’ అని ఉన్నప్పటికీ, ఇది రెండు భాగాలుగా కొనసాగే సీక్వెల్ కాదని, మొదటి భాగంతోనే ఈ కథ పూర్తిగా ముగిసిపోతుందని ఆయన వెల్లడించారు. అలాగే తాము ఈ చిత్రాన్ని కేవలం ఒక భాషలో మాత్రమే కాకుండా, ద్విభాషా చిత్రంగా ప్లాన్ చేయనప్పటికీ.. తమిళ మరియు తెలుగు ప్రేక్షకులు ఇద్దరూ దీన్ని తమ సొంత స్ట్రైట్ సినిమా అనే అనుభూతిని పొందుతారని ధీమా వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో నటీనటుల పాత్రలు అంత్యంత ప్రత్యేకంగా ఉంటాయని దర్శకుడు తెలిపారు. ముఖ్యంగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (ఏఎస్పీ నిత్యా రెడ్డి పాత్రలో) మరియు టాలెంటెడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల ఇద్దరి పాత్రలు వారి ఇప్పటివరకు చేసిన సినిమాలకు, వారి కంఫర్ట్ జోన్‌కు పూర్తిగా భిన్నంగా, అవుట్ అండ్ అవుట్ కొత్తగా ఉంటాయని పేర్కొన్నారు.
ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో ధనుష్‌తో పాటు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వండర్‌బార్ ఫిలింస్ మరియు ఆర్‌టేక్ స్టూడియోస్ పతాకాలపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. అన్ని హంగులను పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 20న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajkumar Periyasamy | అది సీక్వెల్ కాదు, అక్కడితోనే క్లోజ్.. ధనుష్ ‘ఓం’ సినిమాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
Srinivas Goud | రైతాంగానికి ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం చెల్లించాలి: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
KTR | పబ్లిక్ గొంతు నొక్కడం ఏ రకమైన పబ్లిక్ హియరింగ్ అవుతుంది : కేటీఆర్
Culinary Medicine | ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతున్న క్యులినరీ మెడిసిన్.. అసలేమిటి.. ఏం చేస్తుంది..?
Electric Shock | దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం..భార్యభర్తలు మృతి
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

