వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జూలై 3న ఫ్లోరిడాలో ‘సేవ్ అమెరికా’ పేరుతో ర్యాలీ తీయనున్నారు. సరసోటాలో ర్యాలీని నిర్వహించనున్నట్లు బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. ర్యాలీని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఫ్లోరిడా స్పాన్సర్ చేస్తుందని పేర్కొంది. రాత్రి 8 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందని, అర్ధరాత్రి భారీ బాణాసంచ ప్రదర్శనతో ర్యాలీ ముగుస్తుందని ట్రంప్ కార్యాలయం తెలిపింది. ట్రంప్ ఇంతకు ముందు ఓహియోలో ర్యాలీ నిర్వహించారు.