e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home News ర‌వాణాకు క‌రోనా షాక్‌: రోజూ రూ.315 కోట్ల న‌ష్టం

ర‌వాణాకు క‌రోనా షాక్‌: రోజూ రూ.315 కోట్ల న‌ష్టం

ర‌వాణాకు క‌రోనా షాక్‌: రోజూ రూ.315 కోట్ల న‌ష్టం

న్యూఢిల్లీ: క‌రోనా రెండోవేవ్‌తో ర‌వాణా రంగం ప్ర‌తి రోజూ రూ.315 కోట్లు న‌ష్ట‌పోతున్న‌ది. విశ్వ‌మారిని క‌ట్ట‌డి చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వాలు విధిస్తున్న పాక్షిక లాక్‌డౌన్లు, క‌ర్ఫ్యూలు, 144 సెక్ష‌న్‌, ఇత‌ర ఆంక్ష‌ల వ‌ల్ల అత్య‌వ‌స‌ర వ‌స్తువులు మిన‌హా ఇత‌ర స‌రుకు ర‌వాణా ముందుకు సాగ‌డం లేదు.. ఈ సంగ‌తిని అఖిల భార‌త మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) మాజీ అధ్య‌క్షుడు బాల్ మాల్కిట్ సింగ్ చెప్పారు.

క‌రోనా వ‌ల్ల ట్ర‌క్కుల‌కు డిమాండ్ ప‌డిపోయింద‌ని బాల్ మాల్కిట్ సింగ్ తెలిపారు. దేశ‌వ్యాప్తంగా 50 శాతం ట్ర‌క్కులు, లారీలు షెడ్ల‌కే ప‌రిమితం అయ్యాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఔష‌ధాలు, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, ప‌ర్స‌న‌ల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్లు వంటి వైద్య వ‌స్తువులు మాత్ర‌మే ర‌వాణా అవుతున్నాయ‌ని చెప్పారు.

ఆహార వ‌స్తువులు, ఆహార ధాన్యాల ర‌వాణా జ‌రుగుతున్న‌ద‌ని బాల్ మాల్కిట్ సింగ్ వెల్ల‌డించారు. మ‌హారాష్ట్ర‌తోపాటు కొన్ని రాష్ట్రాలు పూర్తిగా ఆంక్ష‌లు విధించ‌డంతో మిగ‌తా వ‌స్తువులేవీ ర‌వాణా కావ‌డం లేద‌ని తెలిపారు.

దేశ ఆర్థిక రాజ‌ధానిగా ముంబై పేరొందితే, దేశంలోనే ఆటోమోటివ్ మాన్యుఫాక్చ‌రింగ్ హ‌బ్‌ల్లో ఒక‌టిగా మ‌హారాష్ట్ర‌ ఉంది. క‌రోనా వ‌ల్ల లారీలు తిర‌గ‌క ట్ర‌క్కుల యాజ‌మాన్యాలు సంక్షోభంలో చిక్కుకున్నార‌ని చెప్పారు.

వ‌ర్క‌ర్లు, డ్రైవ‌ర్ల వేత‌నాలు, రోజువారీ ఖ‌ర్చులు, ప‌న్నులు, బీమా ప్రీమియం చెల్లింపుల కోసం నిధులు స‌మ‌కూర్చుకోవాల్సి వ‌స్తుంద‌న్నారు బాల్ మాల్కిట్ సింగ్‌. బ్యాంకుల్లో తీసుకున్న రుణాల‌పై నెల‌వారీ వాయిదా చెల్లింపుల‌కు ఇత‌ర మార్గాల‌ను అన్వేషిస్తున్నార‌ని చెప్పారు.

గ‌తేడాది మాదిరిగానే రోడ్‌, టోల్ ట్యాక్స్ ర‌ద్దు చేయాల‌ని బాల్ మాల్కిట్ సింగ్ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కోరారు. ట్ర‌క్కు డ్రైవ‌ర్ల‌కు స‌హాయం కోసం ప్ర‌ణాళిక ప్ర‌క‌టించాల‌ని కోరారు.

స్టేట్ ట్యాక్సెస్‌, ప‌ర్మిట్‌, ఫిట్ నెస్ ప‌రీక్ష‌ల నుంచి ట్ర‌క్కుల డ్రైవ‌ర్ల‌కు రాయితీ క‌ల్పించాల‌ని మాల్కిట్ సింగ్ అభ్య‌ర్థించారు. ర‌వాణా రంగంలో ప‌ని చేస్తున్న డ్రైవ‌ర్ల‌కు వ్యాక్సినేష‌న్ చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

ఇవి కూడా చదవండి..

పెండ్లి గౌనులో వచ్చి కరోనా టీకా తీసుకున్న యువతి.. అసలు కారణం తెలిసి షాకైన వైద్య సిబ్బంది

57 దేశాల్లోని మహిళలకు వారి శరీరాలపై హక్కులు లేవు..!

త్వరలో కరోనా మూడో వేవ్‌ వచ్చే అవకాశం : ఆదిత్యా ఠాక్రే

ప్రిన్సిపాల్‌ చెంపదెబ్బ.. బాలిక ఆత్మహత్య

నిత్యం 3 లక్షల రెమ్‌డెసివిర్‌ డోసుల ఉత్పత్తి : మన్సుఖ్‌ మాండవీయ

కరోనా నివారణకు 8 మార్గాలు

రేపు అంగారకుడిపై ఎగరనున్న నాసా హెలికాప్టర్‌

పేదల బాగు కోసం భూదానం.. చరిత్రలో ఈరోజు

ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు మంత్రిని మార్చిన ఇమ్రాన్‌ఖాన్‌

రాత్రి విధుల పేరిట మహిళలకు ఉద్యోగాలివ్వరా?: కేరళ హైకోర్టు

బతుకుదెరువు కోసం ఆటో న‌డుపుతున్న జాతీయ బాక్సర్

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
ర‌వాణాకు క‌రోనా షాక్‌: రోజూ రూ.315 కోట్ల న‌ష్టం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement