Faisal Halim | యువ ఫుట్‌బాలర్‌పై యాసిడ్ దాడి.. అనుమానితుడి అరెస్ట్
Faisal Halim : మలేషియా జాతీయ జట్టు ఫుట్‌బాలర్ ఫైజల్ హలీం(Faisal Halim) తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. 26 ఏండ్ల అతడిపై యాసిడ్ దాడి(Acid Attack) జరిగింది. ఈ సంఘటనలో ఫైజల్ అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
Faisal Halim : మలేషియా జాతీయ జట్టు ఫుట్‌బాలర్ ఫైజల్ హలీం(Faisal Halim) తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. 26 ఏండ్ల అతడిపై యాసిడ్ దాడి(Acid Attack) జరిగింది. ఈ సంఘటనలో ఫైజల్ అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కౌలాలంపూర్‌లోని పెటలింగ్ జయ జిల్లాలో మే 5 ఆదివారం ఫైజల్‌పై ఒక వ్యక్తి యాసిడ్ చల్లాడు. ఈ ప్రమాదంలో ఫైజల్‌కు కాలిన గాయాలయ్యాయి. ఒంటిపై కాలిన గాయాలతో అతడు బెంచీ మీద కూర్చున్న ఫొటోలు నిమిషాల్లోనే ఆన్లైన్లో వైరల్ అయ్యాయి.
యాసిడ్ ప్రభావంతో ఫైజల్ మెడ, భుజాలు, చేతులు, ఛాతిపై చర్మం లేచివచ్చింది. ఈ విషయం తెలియగానే ఫైజల్‌ను హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఫైజల్‌పై యాసిడ్ దాడి కేసులో పోలీసులు ఒక అనుమానితుడిని అరెస్ట్ చేశారు. అయితే.. ఏ ఉద్దేశంతో అతడు ఫుట్‌బాలర్‌పై దాడి చేశాడు? అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
Khabar Duka Buat Pemain Sayap Selangor, Faisal Halim yang dikatakan disimbah asid sebentar tadi di salah sebuah Mall terkemuka.
Diharapkan si pelaku dapat diberkas dgn segera.
Semoga seluruh keluarga Faisal Halim tabah menghadapi ujian ini dan Faisal akn sembuh seperti sediakan. pic.twitter.com/yyEkyTNPks— SSFC (@ssfc_sel) May 5, 2024
‘మికీ’గా పాపులర్
ఫైజల్‌పై దాడిని అక్కడి స్పోర్ట్స్ అధికారులు తీవ్రంగా ఖండించారు. ‘ఫైజల్‌పై యాసిడ్ దాడిని గట్టిగా ఖండిస్తున్నా. అతడికి న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను కోరుతున్నా’ అని నజ్వాన్ హల్మి అనే అధికారి ఓ ప్రకటనలో తెలిపాడు. ‘మికీ’గా పేరొందిన 26 ఏండ్ల ఫైజల్ మలేషియా జట్టులో కీలక ఆటగాడు. మలేషియా సూపర్ లీగ్ క్లబ్ సెలంగొర్ తరఫున స్ట్రయికర్‌గా రాణిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి
- KTR | కరీంనగర్లో బీఆర్ఎస్కు పోటీ బీజేపీతోనే.. కాంగ్రెస్‌తో కాదు : కేటీఆర్
- Daksha Nagarkar | ఆసుపత్రిలో చేరిన ‘జాంబీ రెడ్డి’ హీరోయిన్
- OnePlus 11R | అమెజాన్‌లో రూ. 30,000లోపు వన్‌ప్లస్ 11ఆర్ సొంతం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sangam Banda Reservoir | సంగం బండ రిజర్వాయర్ కాల్వకు గండి.. పొలాలకు సాగునీరందక రైతుల ఆవేదన
CTI Letter | పదిలక్షల మందితో నిరసనకు దిగితే వ్యాపారాలు ఎలా చేసుకోవాలి.. రాహుల్‌గాంధీకి ట్రేడర్స్ మరో లేఖ..!
‘ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు ఓటే ఆయుధం’
MANIKANDA | అయ్యప్పపై ‘మాలికాపూరం’ దర్శకుడి కొత్త చిత్రం.. ‘మణికంఠ’ ఫస్ట్ లుక్ విడుదల
Namo Narayana | రజినీకాంత్ ‘ధర్మన్’ చిత్రంలో కీలక పాత్ర కోసం ‘జైలర్ 2’ ఫేమ్ ‘మూర్తి’!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

