న్యూఢిల్లీ : దేశానికి మరో మూడు యుద్ధ విమానాలు రానున్నాయి. బుధవారం ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. యుద్ధ విమానాలతో పైలట్లు సురక్షితంగా ల్యాండ్ కావాలని ఆకాంక్షించింది. ఐదో విడుతలో ఏప్రిల్‌లో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు చేరుకున్నాయి. యుద్ధ విమానాలు మధ్యలో యూఏఈలో ఇంధనం నింపుకొని నేరుగా భారత్‌కు చేరుకోనున్నాయి. సుమారు రూ.58వేల కోట్ల వ్యయంతో 36 రాఫెల్ జెట్లను కొనుగోలు చేసుకునేందుకు భారత్ 2016 సెప్టెంబర్‌లో ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 17 జెట్లు రాగా.. కొత్తగా వచ్చే వాటితో ఆ సంఖ్య 20కి చేరనుంది. గతేడాది జూలై 29న రాఫెల్ ఫస్ట్ బ్యాచ్ జెట్లు దేశానికి చేరాయి.
Next batch of three #Rafales leave from France to India today; wished the pilots smooth flight and safe landing. pic.twitter.com/z7UR4sXSBW
— India in France (@IndiaembFrance) May 5, 2021