కరోనా విలయం.. 24 గంటల్లో 3.82లక్షల కేసులు.. 3,780 మంది మృతి
24 గంటల్లో 3.82లక్షల కేసులు.. 3,780 మంది మృతి | దేశంలో కరోనా విలయం కొనసాగుతున్నది. గత మూడు రోజుల్లో కాస్త తగ్గుతూ వచ్చిన కేసులు మళ్లీ భారీగా పెరిగాయి.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా విలయం కొనసాగుతున్నది. గత మూడు రోజుల్లో కాస్త తగ్గుతూ వచ్చిన కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 3,82,315 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. మరో 3,780 మంది మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. తాజాగా 3,83,439 మంది కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,06,65,148కు పెరగ్గా.. ఇప్పటి వరకు 1,69,51,731 మంది కోలుకున్నారు. మరో 2,26,188 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం దేశంలో 34,87,229 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. టీకా డ్రైవ్లో భాగంగా ఇప్పటి వరకు 16,04,94,188 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. గత కొన్నిరోజులుగా కరోనా సునామీని చవిచూసిన దేశంలో గత మూడు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టగా.. మళ్లీ భారీగా పెరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా.. నిన్న ఒకే రోజు 15.41లక్షల టెస్టులు చేయగా.. ఇప్పటి వరకు 29.48కోట్ల టెస్టులు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ హాస్పిటల్లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం
రాష్ట్రానికి మరో రెండు రోజుల వర్ష సూచన
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు
వచ్చే వారంలో కోవోవాక్స్ క్లినికల్ ట్రయల్స్
కరోనా ఎఫెక్ట్.. 16 రైళ్లను రద్దు చేసిన రైల్వే
డబుల్ మ్యూటెంట్ ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణతో సరిహద్దులు మూసివేసిన ఒడిశా
తెలంగాణలో కొత్తగా 6,361 కరోనా కేసులు
కరోనా వేళ కలప సాయం
బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించండి
ప్లాస్మా మాకివ్వరూ!
వ్యాక్సినేషన్ పేరిట ఫేక్కాల్స్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

