కరోనా ఎఫెక్ట్.. 16 రైళ్లను రద్దు చేసిన రైల్వే
కరోనా ఎఫెక్ట్.. 16 రైళ్లను రద్దు చేసిన రైల్వే | కరోనా మహమ్మారి ప్రభావంతో భారీగా రైళ్లు రద్దవుతున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో సర్వీసులను రద్దు చేసిన రైల్వేశాఖ తాజాగా.. మరో 16 ట్రెయిన్లను రద్దు చేసింది.

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రభావంతో భారీగా రైళ్లు రద్దవుతున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో సర్వీసులను రద్దు చేసిన రైల్వేశాఖ తాజాగా.. మరో 16 ట్రెయిన్లను రద్దు చేసింది. ఈ నెల 7 నుంచి రైళ్లు అందుబాటులో ఉండవని, ఈ మేరకు ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నట్లు విచారం వ్యక్తం చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రైళ్లు నిలిపి వేయనున్నట్లు తూర్పు రైల్వేశాఖ తెలిపింది. హౌరా-రాంచీ (02019), రాంచీ-హౌరా (02020), హౌరా-ధన్‌బాద్ (02339), ధన్‌బాద్ – హౌరా (02340), హౌరా-అజీమ్గంజ్ (03027), అజీమ్గంజ్-హౌరా (03028), హౌరా-రాంపూర్హాట్ (03047), రాంపూర్హాట్-హౌరా (03048), కోల్‌కతా-లాల్గొల (03117), లాల్గొల – కోల్‌కతా (03118) సీల్దా – రాంపూర్హాట్ (03187), రాంపూర్హాట్-సీల్దా (03188), భగల్పూర్ – దానాపూర్ (03401), దానాపూ – భగల్పూర్ (03402) అసన్సోల్ – హల్దియా (03502), హల్దియా-అసన్సోల్ (03501) ట్రెయిన్లు రద్దయ్యాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్ విధిస్తుండగా.. మరికొన్ని లాక్డౌన్ తరహాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గడంతో రైల్వేశాఖ ఇటీవల పెద్ద ఎత్తున సర్వీసులను రద్దు చేస్తూ వస్తోంది. ఇటీవల నార్త్ వెస్ట్రన్ రైల్వే రీజియన్‌లో 40 రద్దు చేసిన విషయం తెలిసిందే. అలాగే దక్షిణ మధ్య రైల్వేలోనూ 21 సర్వీసులు రద్దయ్యాయి.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ హాస్పిటల్లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం
రాష్ట్రానికి మరో రెండు రోజుల వర్ష సూచన
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు
వచ్చే వారంలో కోవోవాక్స్ క్లినికల్ ట్రయల్స్
కరోనా వేళ కలప సాయం
బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించండి
ప్లాస్మా మాకివ్వరూ!
వ్యాక్సినేషన్ పేరిట ఫేక్‌కాల్స్
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

