Konatham Dileep | హైదరాబాద్ : తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అరెస్టును ఆయన భార్య, రచయిత స్వర్ణ కిలారి తీవ్రంగా ఖండించారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన దిలీప్ కొణతంను దొడ్డిదారిన అరెస్టు చేయడం దుర్మార్గమని ఆమె మండిపడ్డారు.
గత పది నెలలుగా ఎన్నో రకాలుగా కేసులు పెట్టాలని ప్రయత్నించి విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డి దారిన ఈరోజు దిలీప్‌ను అరెస్ట్ చేసింది. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా పోలీసులకు కావలసిన వివరాలు ఇవ్వడానికి సైబర్ క్రైమ్ కార్యాలయానికి వెళ్లిన దిలీప్‌ను కాసేపు విచారించి, దొంగ దారిలో ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లి అక్కడేవో టెస్టులు చేయించి అటునుండటే అరెస్టుచేసి తీసుకెళ్లిపోయారు. పోలీసుల అక్రమ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తున్నాను అని స్వర్ణ కిలారి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | ప్రశ్నిస్తే సంకెళ్లు..! నిలదీస్తే అరెస్టులు..!! కొణతం దిలీప్ అరెస్టుపై మండిపడ్డ కేటీఆర్
Y Satish Reddy | ఎన్ని కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపేది లేదు : వై సతీష్ రెడ్డి
Konatham Dileep | కొణతం దిలీప్ అరెస్ట్.. తీవ్రంగా ఖండించిన హరీశ్‌రావు