KTR | హైదరాబాద్ : తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌ను పోలీసులు మళ్లీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దిలీప్ అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే సంకెళ్లు వేయడం.. నిలదీస్తే అరెస్టు చేయడం సరికాదన్నారు కేటీఆర్.
నియంత రాజ్యమది.. నిజాం రాజ్యాంగమిది.. అని రేవంత్ రెడ్డి సర్కార్‌ను దుయ్యబట్టారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే కొణతం దిలీప్ అరెస్ట్.. విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా? అని ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు.
ఎన్నాళ్లు ఈ అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తావ్! ప్రజాస్వామ్య ప్రేమికులం.. ప్రజాస్వామ్యబద్దంగానే ఎదుర్కొంటాం! అని తేల్చిచెప్పారు కేటీఆర్. నీ అక్రమ అరెస్టులకో.. నీ ఉడత బెదిరింపులకో.. భయపడం..! నీ అక్రమ అరెస్టులకు భయపడేవాడు ఎవరూ లేరిక్కడ అని కేటీఆర్ స్పష్టం చేశారు. చివరగా జై తెలంగాణ అని పేర్కొంటూ కేటీఆర్ తన ట్వీట్‌ను ముగించారు.
ప్రశ్నిస్తే సంకెళ్లు…నిలదీస్తే అరెస్టులు..
నియంత రాజ్యమది…నిజాం రాజ్యాంగమిది..కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే కొణతం దిలీప్ గారి అరెస్ట్
విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా?ఎన్నాళ్లు ఈ అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తావ్!
ప్రజాస్వామ్య…— KTR (@KTRBRS) November 18, 2024
ఇవి కూడా చదవండి..
Y Satish Reddy | ఎన్ని కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపేది లేదు : వై సతీష్ రెడ్డి
Konatham Dileep | కొణతం దిలీప్ అరెస్ట్.. తీవ్రంగా ఖండించిన హరీశ్‌రావు
Harish Rao | కేసీఆర్ ఫుల్ ఫాంలోకి వస్తాడు.. రాబోయే రోజుల్లో కప్ మనదే : హరీశ్‌రావు