కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రస్తుతం డైరెక్టర్ శివ (Siva) దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో బిజీగా ఉన్నాడు. పీరియాడిక్ స్టోరీ నేపథ్యంలో సూర్య 42 (Suriya 42)గా వస్తున్న ఈ మూవీ మోషన్ పోస్టర్ నెట్టింటిని షేక్ చేస్తోంది. మేకర్స్ ఇవాళ సినీ జనాలు, సూర్య అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. అదేంటంటే సాధారణ స్టార్ హీరోల సినిమా చిత్రీకరణ పబ్లిక్‌గా జరుగుతుందంటే అక్కడున్న వారు తమ ఫోన్లతో ఆ సన్నివేశాలను చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు.
అంతేకాదు కొందరైతే వాటిని నెట్టింట షేర్ చేస్తుంటారు. తాము ఎంతో కష్టపడి చెమటోడ్చి సినిమా తీస్తామని, షూటింగ్‌కు సంబంధించిన వీడియోలు కానీ, ఫొటోలు కానీ ఇంటర్నెల్లో పెట్టొద్దని మేకర్స్ కోరారు. ఎవరైనా తమ విజ్ఞప్తిని పట్టించుకోకుండా వీడియోలు, విజువల్స్ పోస్ట్ చేస్తే కాపీ రైట్ కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సున్నితంగా హెచ్చరించారు.
ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సూర్య 42 ప్రాజెక్టును 10 భాషల్లో విడుదల చేయడంతోపాటు 3డీ ఫార్మాట్లో కూడా విడుదల కానున్నట్టు టాక్. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.