Aadipurush | ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్..ఆదిపురుష్ క్రేజీ అప్డేట్
మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఆదిపురుష్ (Aadipurush) చిత్రాన్ని తానాజీ ఫేం ఓం రౌత్ (Om Raut) డైరెక్ట్ చేస్తున్నాడు. ఆదిపురుష్‌లో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా..బాలీవుడ్ భామ కృతిసనన్ సీత పాత్రలో నటిస్తోంది.
పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas) అభిమానులు కొత్త అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఆదిపురుష్ (Aadipurush) ఒకటి. మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని తానాజీ ఫేం ఓం రౌత్ (Om Raut) డైరెక్ట్ చేస్తున్నాడు. ఆదిపురుష్‌లో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా..బాలీవుడ్ భామ కృతిసనన్ సీత పాత్రలో నటిస్తోంది.
2023 జనవరి 12న ఆదిపురుష్ గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ రాక చాలా కాలమే అవుతుంది. దీంతో తీవ్ర అసహనంలో ఉండిపోయిన ప్రభాస్ అభిమానుల కోసం క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది. ఆదిపురుష్ టీజర్‌ను అక్టోబర్ 2న అయోధ్యలో లాంఛ్ చేయాలని నిర్ణయించారు.
టీజర్ లాంఛింగ్‌కు రాముడి జన్మస్థలమైన అయోధ్యనే సరైన ప్రదేశమని భావించిన మేకర్స్..ఫస్ట్ లుక్ అక్కడే విడుదల చేయాలని నిర్ణయించినట్టు బీటౌన్ సర్కిల్ సమాచారం. ఈవెంట్లో ప్రభాస్, ఓం రౌత్ సందడి చేయనున్నారని తెలుస్తోండగా..వీరితోపాటు ఎవరెవరు వస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ఫస్ట్ లుక్ లాంఛ్ తర్వాత చిత్రయూనిట్ అక్టోబర్ 5న లవ్కుష్ రామ్‌లీలా కార్యక్రమానికి హాజరుకానున్నారట. ప్రభాస్ దసరా వేడుకలు, రావణ దహనం కార్యక్రమాల్లో పాల్గొననున్నాడని ఇన్ సైడ్ టాక్.
టీ సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్‌కు సాచెట్-పరంపర సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, ఆంగ్ల భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ లంకేశ్ పాత్ర పోషిస్తుండగా..లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ్‌దత్తా నగే నటిస్తున్నారు.
Read Also : Krishna Vrinda Vihari collections | నాగశౌర్యకు బ్రేక్ పడ్డట్టే..కొత్త సినిమాల్లో ఉత్తమ కలెక్షన్లు..!
Read Also : Swathi Muthyam Trailer | లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో గణేశ్, వర్ష ‘స్వాతిముత్యం’ ట్రైలర్
Read Also : Ponniyin Selvan-1 Ticket Prices | తెలుగు సినిమాలు చేయని సాహసం..పొన్నియన్ సెల్వన్-1 టికెట్ ధర ఎంతంటే..?
Read Also : Nagarjuna Thaar Maar Thakkar Maar Dance | చిరు పాటకు నాగార్జున డ్యాన్స్ చేస్తే..ట్రెండింగ్‌లో వీడియో
Read Also : Brahmastra | బ్రహ్మాస్త్ర మేకర్స్ కొత్త స్ట్రాటజీ అదిరింది..కలెక్షన్లు మరింత పెరిగేనా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

