Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. లోక్‌సభ ఎన్నికలకు కేవలం కొద్దిరోజుల ముందే కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్ట్ చేశారనే ప్రశ్నలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) స్పందించాలని సర్వోన్నత న్యాయస్ధానం దర్యాప్తు ఏజెన్సీని కోరింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించడాన్ని సవాల్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ సుప్రీంకోర్ట్ బెంచ్ దర్యాప్తు ఏజెన్సీని ప్రశ్నించింది. వ్యక్తి స్వేచ్ఛ అనేది చాలా కీలకమైనదని దీన్ని మీరు నిరాకరించలేరని జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు.
ఇక కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన సమయంపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. విచారణ చేపట్టడం, ఆపై పలు ఫిర్యాదుల పునరావృతం కావడం మధ్య ఎందుకు విరామం ఉందనే వివరాలపైనా స్పందించాలని దర్యాప్తు సంస్ధను సుప్రీంకోర్టు కోరింది.
Read More :
Hyderabad | ఇదెక్కడి మార్పు బాబోయ్!.. నీటి ఎద్దడి, కరెంటు కోతలతో విసిగిపోతున్న గ్రేటర్ జనం