JEE | జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల
JEE | జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్షకు అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. మే 26న జరగనున్న ఈ పరీక్ష అడ్మిట్ కార్డులను ఐఐటీ మద్రాస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్డుల్ని మే 26న మధ్యాహ్నం 2.30గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
JEE | హైదరాబాద్ : జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్షకు అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. మే 26న జరగనున్న ఈ పరీక్ష అడ్మిట్ కార్డులను ఐఐటీ మద్రాస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్డుల్ని మే 26న మధ్యాహ్నం 2.30గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయడం ద్వారా హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారితంగా జరిగే ఈ పరీక్ష పేపర్ -1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ -2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనుంది.
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసిన విద్యార్థుల రెస్పాన్స్ షీట్లను మే 31 నుంచి అందుబాటులో ఉంచుతారు. ప్రాథమిక కీ జూన్ 2న విడుదల చేసి తుది కీ, ఫలితాలను జూన్ 9న ప్రకటిస్తారు. ఈ పరీక్షలో ర్యాంకులు సాధించిన వారికి దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీలు, ఇతర ప్రఖ్యాత యూనివర్సిటీల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

