Viduthalai Movie | వెట్రిమారన్ ‘విడుదలై పార్ట్ 2’లో ఎస్జే సూర్య
Viduthalai Movie | హీరోల ఇమేజ్‌తో సంబంధంలేకుండా కేవలం కథకు ఏది కావాలో దాన్ని మాత్రమే తెరకెక్కించే తమిళ దర్శకుడు వెట్రిమారన్. ఆయన సినిమాల్లోని హీరో పాత్రకు భారీ ఎలివేషన్లు, యాక్షన్ సీన్లు గట్రా ఏమి ఉండవు. ఎంత పెద్ద స్టార్ అయినా సరే.. కథకు ఏమి కావాలో అది మాత్రమే తీస్తాడు.
Viduthalai Movie | హీరోల ఇమేజ్‌తో సంబంధంలేకుండా కేవలం కథకు ఏది కావాలో దాన్ని మాత్రమే తెరకెక్కించే తమిళ దర్శకుడు వెట్రిమారన్. ఆయన సినిమాల్లోని హీరో పాత్రకు భారీ ఎలివేషన్లు, యాక్షన్ సీన్లు గట్రా ఏమి ఉండవు. ఎంత పెద్ద స్టార్ అయినా సరే.. కథకు ఏమి కావాలో అది మాత్రమే తీస్తాడు. తమిళంలోనే కాకుండా తెలుగులోను వెట్రిమారన్‌కు యమ క్రేజ్ ఉంది. కేవలం పోస్టర్‌పై ఆయన పేరు కనిపిస్తే చాలు ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడిపోతుంటారు. ఇక గత ఏడాది ఆయన దర్శకత్వం వహించిన ‘విడుతలై పార్ట్-1’ రిలీజై మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ‘విడుతలై 2’ రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో తమిళ నటుడు ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మేకర్స్ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయకపోగా.. త్వరలోనే అనౌన్స్ చేయనున్నట్లు కోలీవుడ్‌లో టాక్ నడుస్తుంది. కోలీవుడ్ నటుడు కమెడియన్ సూరి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ రోల్లో నటించాడు. ఇక ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందించాడు. ఇక విడుదలై పార్ట్ 2 ఎప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

