గౌహతి: అస్సాం బీజేపీలో (Assam BJP) విభేదాలు బయటపడ్డాయి. మంత్రి వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎమ్మెల్యే మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయనకు చెప్పాలంటూ సీఎంకు సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో బహిరంగంగా పోస్ట్ చేశారు. 2015లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన మంత్రి జయంత మల్లబరువా ఇటీవల మీడియాతో మాట్లాడారు. పాత కాలం బీజేపీ నేతలపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘గత 50 సంవత్సరాలుగా పార్టీలో ఉన్నప్పటికీ, వారు పార్టీకి సమయం కేటాయించరు. కాబట్టి, పార్టీకి మీ సహకారం, పార్టీ పట్ల మీ అంకితభావం, నిబద్ధత ఎంత అన్నది మీ తీరు నిర్ణయిస్తుంది’ అని అన్నారు.
కాగా, బీజేపీ మంత్రి జయంత వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎమ్మెల్యే మృణాల్ సైకియా మండిపడ్డారు. ఆయన మాట్లాడే తీరు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని దెబ్బతీసేలా ఉందని విమర్శించారు. ఈ నేపథ్యంలో నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పాలంటూ సీఎం హిమంత బిస్వా శర్మకు సూచించారు. ఈ మేరకు బహిరంగంగా విమర్శిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మంత్రి జయంత మాట్లాడిన వీడియో క్లిప్‌ను కూడా అందులో షేర్ చేశారు.
#8pm :- Respected HCM @himantabiswa sir, pl tell @jayanta_malla to keep his mouth shut about party affairs. He should realise by now that his style of talking has already spoiled thousands of @bjp4assam votes in this #election2024 pic.twitter.com/xoN6o9bpMN
— Mrinal Saikia (@Mrinal_MLA) May 15, 2024