జూన్ 15 నాటికి రాష్ట్రాలకు 5.86 కోట్ల డోసులు
జూన్ 15 నాటికి రాష్ట్రాలకు 5.86 కోట్ల డోసులు | ఈ నెల ఒకటో తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 5.86 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్లను ఉచితంగా సరఫరా చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.

న్యూఢిల్లీ : ఈ నెల ఒకటో తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 5.86 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్లను ఉచితంగా సరఫరా చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. జిల్లా పరిపాలన జూన్ మధ్య కాలం వరకు ప్రణాళిక చేసుకోవాలని, కేంద్రాల్లో రద్దీని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. కేంద్రం కోటా కింద రాష్ట్రాలకు 5.86 డోసులు అందజేయనున్నట్లు చెప్పింది. 75శాతం డోసులు 45పైబడిన జనాభాకు రెండో మోతాదులు, 30 శాతం మొదటి మోతాదులు ఇందులో ఉండనున్నాయి. 18-44 ఏళ్ల వయస్సు వారికి కేంద్రం వ్యాక్సిన్లు సరఫరా చేయడం లేదు.
రాష్ట్రాలు కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ తయారీదారుల నుంచి నేరుగా సేకరించేందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 16 నుంచి 31 మధ్యలో 1.92 కోట్ల మోతాదులు సరఫరా చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది. ఇందులో 162.5 లక్షల మోతాదుల కొవిషీల్డ్, 29.49 లక్షల మోతాదు కొవాగ్జిన్ డోసులున్నాయని తెలిపింది. జూన్ వరకు సరఫరా చేయనున్న వ్యాక్సిన్లకు సంబంధించి స్పష్టమైన సమాచారాన్ని రాష్ట్రాలకు అందజేశామని, డ్రైవ్‌ను విజయవంతం చేసేందుకు స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్రాలను కోరినట్లు బుధవారం కేంద్రం చెప్పింది. వ్యాక్సినేషన్ సెంటర్లు తమ వ్యాక్సినేషన్ క్యాలెండర్‌ను ముందుగానే కొవిన్ ప్లాట్‌ఫామ్‌పై తెలుపాలని సూచించింది.
ఇవి కూడా చదవండి..
నేడు కేరళలో కొలువుదీరనున్న విజయన్ సర్కారు
కేకే శైలజను కేబినెట్లోకి తీసుకోకపోవడంపై సీఎం ఎమన్నారంటే..?
ఇక ఇంట్లోనే కొవిడ్ టెస్టు!.. ‘కొవిసెల్ఫ్’కు ఐసీఎంఆర్ ఆమోదం..
కరోనాతో రాజస్థాన్ మాజీ సీఎం పహాడియా కన్నుమూత
ఆయుర్వేద మందులతో బ్లాక్ ఫంగస్‌కు చెక్
రష్యాలో టీకా పర్యాటకం
సెంట్రల్ జైలులో 53 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్
దేశంలో 24గంటల్లో 2.76లక్షల కేసులు.. 3,874 మరణాలు
ఢిల్లీలో 70 ఏళ్ల తర్వాత కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు
కరోనాతో జామియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

