దేశంలో 24గంటల్లో 2.76లక్షల కేసులు.. 3,874 మరణాలు
దేశంలో 24గంటల్లో 2.76లక్షల కేసులు.. 3,874 మరణాలు | దేశంలో వరుసగా నాలుగో రోజు మూడు లక్షలకు దిగువన కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిచ్చే కరోనా కేసులు కాస్త పెరిగినా.. మరణాలు తగ్గముఖం పట్టాయి.

న్యూఢిల్లీ : దేశంలో వరుసగా నాలుగో రోజు మూడు లక్షలకు దిగువన కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిచ్చే కరోనా కేసులు కాస్త పెరిగినా.. మరణాలు తగ్గముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 2,76,070 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. నాలుగు రోజుల తర్వాత దేశంలో 4వేలకు దిగువ మరణాలు రికార్డయ్యాయి. వైరస్ ప్రభావంతో కొత్తగా 3,874 మంది మృత్యువాతపడ్డారని పేర్కొంది. తాజాగా 3,69,077 మంది బాధితులు కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,57,72,400కు చేరాయి.
ఇప్పటి వరకు 2,23,55,440 మంది కోలుకున్నారు. మొత్తం 2,87,122 మంది బాధితులు మహమ్మారి సోకి ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 31,29,878 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 18,70,09,792 టీకా డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. మరో వైపు నిన్న దేశవ్యాప్తంగా భారీగా కొవిడ్ పరీక్షలు జరిగాయి. ఒకే రోజు 20,55,010 టెస్టులు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 32,23,56,187 నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
నేడు కేరళలో కొలువుదీరనున్న విజయన్ సర్కారు
కేకే శైలజను కేబినెట్లోకి తీసుకోకపోవడంపై సీఎం ఎమన్నారంటే..?
ఇక ఇంట్లోనే కొవిడ్ టెస్టు!.. ‘కొవిసెల్ఫ్’కు ఐసీఎంఆర్ ఆమోదం..
కరోనాతో రాజస్థాన్ మాజీ సీఎం పహాడియా కన్నుమూత
ఆయుర్వేద మందులతో బ్లాక్ ఫంగస్‌కు చెక్
రష్యాలో టీకా పర్యాటకం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

