నార్నూర్ : వందేమాతరం ( Vande Mataram ) గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలంలో శుక్రవారం అధికారులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వందేమాతరం ఉద్ధేశం, గీతం దేశానికి ఉపయోగపడ్డ తీరును వివరించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో వందేమాతరం ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నార్నూర్ ఎంఈవో పవర్ అనిత, గాదిగూడ ఎంపీ ఓ రమేష్, మాజీ జడ్పీటీసీ హేమలత బ్రిజ్జిలాల్, నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్, సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ గజానంద్ నాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేస్రం హన్మంతరావు, దళిత అవార్డు గ్రహీత కొరల మహేందర్, నాయకులు చౌహాన్ యశ్వంత్ రావు, సుల్తాన్ ఖాన్, హైమద్, ఈశ్వర్, మోహన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.