Jewellery | గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ (Ahmedabad)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బంగారం (Jewellery) దుకాణానికి వెళ్లిన ఓ మహిళ.. అక్కడ యజమాని కళ్లలో కారం (Chilli Powder) కొట్టేందుకు యత్నించింది. వెంటనే గ్రహించిన సదరు వ్యక్తి ఆమెను చితకబాదాడు. ఇందుకు సంబంధించిన దృష్యాలు షాప్‌లోని సీసీటీవీలో రికార్డయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. రాణిప్ ప్రాంతంలో ఉన్న బంగారం దుకాణంలో సోని అనే వ్యక్తి ఒక్కడే ఉన్నాడు. అదే సమయంలో ఓ మహిళ దుకాణంలోకి వచ్చికూర్చుంది. సోని ఒంటరిగా ఉండటాన్ని గమనించి.. చోరీ చేసేందుకు పథకం రచించింది. ఈ క్రమంలో అతడి కళ్లలోకి కారం కొట్టేందుకు ప్రయత్నించింది. ఆమె చర్యను వెంటనే గుర్తించిన సోని.. ముఖం పక్కకు తిప్పుకున్నాడు. అనంతరం ఆమెను పట్టుకుని చితకబాదాడు. అనంతరం దుకాణం నుంచి బయటకు తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు షాప్‌లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై వీడియో ఆధారంగా రాణిప్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
મહિલાએ આંખમાં મરચું નાખ્યું, સોનીએ 25 સેકન્ડમાં 20 લાફા ઝીંક્યા, જુઓ CCTV#ahmedabadnews #ranip #ranipgoldstore #robbery #viralvideo #viralnews #ahmedabadcrime pic.twitter.com/ddwXUjWPFU
— Dinesh Chaudhary (@DineshNews_) November 6, 2025
Also Read..
Delhi Airport | ఢిల్లీ ఏటీసీలో సాంకేతిక సమస్య.. 100కుపైగా విమానాలు ఆలస్యం