Delhi Airport | దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (Delhi Airport)లో సాంకేతిక సమస్య (technical glitch) తలెత్తింది. ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (Air Traffic Control) సిస్టమ్‌లో శుక్రవారం ఉదయం ఈ సమస్య వచ్చింది. దీంతో విమానాల రాకపోకలకు (flights hit) అంతరాయం ఏర్పడింది. దాదాపు 100కుపైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
‘ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ కారణంగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ఆలస్యమవుతున్నాయి. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని అధికారులు తెలిపారు. ఫ్లైట్స్ అప్డేట్ కోసం ప్రయాణికులు విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు. ఏటీసీలో సాంకేతిక సమస్య కారణంగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఎయిర్ ఇండియా సహా పలు విమానాయనాన సంస్థలు తెలిపాయి.
Also Read..
డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై దాడి
నేటి నుంచి ‘వందే మాతరం’ 150 ఏండ్ల ఉత్సవాలు