న్యూఢిల్లీ: ఏడాది పాటు సాగే భారత జాతీయ గేయం ‘వందే మాతరం’ 150 ఏండ్ల ఉత్సవాలను శుక్రవారం ప్రధాని మోదీ న్యూఢిల్లీలో ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా ఉదయం 9.50కి పబ్లిక్ ప్రదేశాల్లో ఈ గేయాన్ని సామూహికంగా ఆలపిస్తారు.
నాలుగు దశల్లో ఈ ఉత్సవాలను నిర్వహించాలని కేంద్రం ప్రణాళిక రచించింది. ఈ ఉత్సవాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని.. సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ వివిధ శాఖలను కోరింది.