కోల్‌కతా: ఇద్దరు మహిళలు సామాజిక కట్టుబాట్లను అధిగమించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రొఫెషనల్ డ్యాన్సర్లు అయిన వారిద్దరి వివాహం ఒక గుడిలో జరిగింది. ఒక మహిళ కుటుంబం వీరి పెళ్లికి మద్దతిచ్చింది. (Two Women Marry) పశ్చిమ బెంగాల్లో ఈ సంఘటన జరిగింది. దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని మందిర్బజార్కు చెందిన రియా సర్దార్ చిన్నతనంలోనే తల్లిదంద్రులను కోల్పోయింది. దీంతో బంధువుల ఇంట్లో పెరిగింది. రెండేళ్ల కిందట బకుల్తాలాకు చెందిన రాఖీ నస్కర్, రియా కలుసుకున్నారు. డ్యాన్సర్లు అయిన వీరిద్దరి మధ్య స్నేహం పెరిగింది. అది ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకున్నారు.
కాగా, రాఖీతో సంబంధం గురించి తన కుటుంబానికి రియా చెప్పింది. అయితే ఇద్దరు మహిళల మధ్య ప్రేమ సంబంధాన్ని ఆమె కుటుంబం అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో రియా తన కుటుంబాన్ని వీడింది. వీరి సంబంధానికి మద్దతిచ్చిన రేఖా ఇంటికి ఆమె చేరింది. సామాజిక అడ్డంకులను ఛేదించిన ఇద్దరు మహిళలు మంగళవారం ఒక గుడిలో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. ఒకరి మెడలో మరొకరు పూలదండలు వేశారు.
మరోవైపు పెళ్లి తర్వాత రియా, రేఖా మీడియాతో మాట్లాడారు. ప్రేమకు లింగ భేదం, సరిహద్దులు లేవన్నారు. నిజమైన ప్రేమే తమకు ముఖ్యమని తెలిపారు. ‘మా స్వంత కోరికలను మేం గౌరవించాం. ప్రేమ నిజంగా ముఖ్యమైనది. ఒక స్త్రీ మాత్రమే పురుషుడిని ప్రేమించగలదని లేదా ఒక పురుషుడు మాత్రమే స్త్రీని ప్రేమించగలడని ఎవరు నిర్ణయించారు? ఒక స్త్రీ కూడా మరో స్త్రీని ప్రేమించగలదు’ అని అన్నారు.
కాగా, గత ఏడాది సెప్టెంబర్‌లో పశ్చిమ బెంగాల్‌లోని దుబ్రాజ్‌పూర్‌లో ఇలాంటి సంఘటన జరిగింది. ఇద్దరు మహిళల మధ్య స్నేహం వారి వివాహానికి దారి తీసింది. ఖైరషోల్కు చెందిన సుష్మితా ఛటర్జీతో కలిసి జీవించాలని మాల్దాకు చెందిన నమితా దాస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆమె ఇంటికి చేరుకున్నది. ఆ తర్వాత దుబ్రాజ్పూర్లోని శివాలయంలో సుష్మిత, నమిత పెళ్లి చేసుకున్నారు. అనంతరం వైవాహిక జీవితాన్ని వారు ప్రారంభించారు.
Also Read:
Man Abandons Son At Border | భార్యతో గొడవ.. దేశ సరిహద్దులో కుమారుడ్ని వదిలేసిన వ్యక్తి
Watch: పెంపుడు కుక్కను లిఫ్ట్‌లో చంపిన పనిమనిషి.. వీడియో వైరల్