కోల్‌కతా: భార్యాభర్తలు గొడవ పడ్డారు. దీంతో భర్త, కుమారుడ్ని వదిలేసిన భార్య తన పుట్టింటికి వెళ్లింది. అయితే కుమారుడ్ని భార్యకు అప్పగించేందుకు భర్త ప్రయత్నించాడు. ఆమె అంగీకరించకపోవడంతో దేశ సరిహద్దులో వదిలేశాడు. (Man Abandons Son At Border) పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అశోక్‌నగర్ పోలీస్ స్టేషన్‌లోని కాథ్పోల్ ప్రాంతంలో నివసించే పింటు ఘోష్, మాధవి భార్యాభర్తలు. వారికి పదేళ్ల కుమారుడు ఉన్నాడు.
కాగా, భార్యాభర్తలు తరచుగా గొడవపడేవారు. ఇటీవల వారి గొడవ తీవ్రస్థాయికి చేరింది. దీంతో మాధవి తన పదేళ్ల కుమారుడ్ని అత్తవారింట్లో వదిలేసింది. పుట్టింటికి వెళ్లి అక్కడ ఉంటున్నది. భార్య తిరిగి రాకపోవడంతో భర్త పింటు మంగళవారం రాత్రి తన కుమారుడు, అతడి బట్టల బ్యాగ్ తీసుకుని అత్తవారింటికి వెళ్లాడు. కొడుకును ఆమె వద్ద ఉంచుకోవాలని భార్య మాధవికి చెప్పాడు. అయితే దానికి ఆమె ఒప్పుకోలేదు.
మరోవైపు భార్య తీరుపై పింటు ఆగ్రహించాడు. కుమారుడ్ని బైక్‌పై ఎక్కించుకున్నాడు. అతడి బట్టల సంచితో సహా బసిర్హాట్ ప్రాంతంలోని భారత్, బంగ్లా సరిహద్దుకు చేరుకున్నాడు. రాత్రి వేళ పదేళ్ల కుమారుడ్ని సరిహద్దు ప్రాంతంలో వదిలేశాడు. బైక్‌పై అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కాగా, సరిహద్దు ప్రాంతంలో ఒంటరిగా ఉన్న ఆ బాలుడు బిక్కుబిక్కుమంటూ ఏడ్చాడు. స్థానికులు అతడ్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ బాలుడ్ని బసిర్హాట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తినేందుకు ఆహారం ఇచ్చారు. ఆ బాలుడి నుంచి జరిగిన సంగతిని పోలీసులు తెలుసుకున్నారు. తల్లిదండ్రుల వివరాలు, అడ్రస్ సేకరించారు.
బుధవారం ఆ బాలుడి తల్లిదండ్రులైన పింటు, మాధవిని పోలీస్ స్టేషన్‌కు పోలీసులు పిలిపించారు. వారిద్దరిని మందలించడంతో పాటు కౌన్సెలింగ్ ఇచ్చారు. కుమారుడ్ని వారికి అప్పగించారు.
Also Read:
Teen Set On Fire, Man Hanging | నిప్పంటించుకుని యువతి మృతి.. సమీపంలోని ఇంట్లో వ్యక్తి సూసైడ్
BJP Leader Phool Joshi | బీజేపీ నాయకురాలి ‘సెక్స్ రాకెట్’ గుట్టురట్టు.. ఆర్జేడీ మండిపాటు
Watch: ఎయిర్‌పోర్టులో ఎదురుపడిన తేజ్ ప్రతాప్, తేజస్వి యాదవ్.. తర్వాత ఏం జరిగిందంటే?