పాట్నా: బీజేపీ నాయకురాలి ‘సెక్స్ రాకెట్’ గుట్టురట్టయ్యింది. ఒక మీడియా సంస్థ స్టింగ్ ఆపరేషన్‌లో సంచలన విషయాలు ఆమె బయటపెట్టింది. నేతల వద్దకు అమ్మాయిలను పంపుతున్నట్లు చెప్పింది. బీహార్ ఎన్నికల్లో కేంద్ర నాయకత్వం తనకు పెద్ద బాధ్యత అప్పగించినట్లు వెల్లడించింది. (BJP Leader Phool Joshi) జార్ఖండ్ బీజేపీ ఎస్టీ మోర్చా నాయకురాలు ఫూల్ జోషి, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ‘జై బీజేపీ, విజయ్ బీజేపీ’ ప్రచారాన్ని నిర్వహిస్తున్నది. ‘దైనిక్ భాస్కర్’ ఆమెపై స్టింగ్ ఆపరేషన్ చేపట్టింది.
కాగా, బీజేపీ నాయుకురాలు ఫూల్ జోషి సంచలన విషయాలు బయటపెట్టింది. ఆమె నిర్వహించే ‘సెక్స్ రాకెట్’ గుట్టును రట్టు చేసింది. ‘నాయకుల అభిరుచి నాకు తెలుసు. వాళ్ళు గ్లామరస్ అమ్మాయిలను కోరుకుంటారు. కొందరు సింగిల్‌గా, మరికొందరు డబుల్‌గా ఎంజాయ్ చేస్తారు. కొన్నిసార్లు ఇద్దరు నాయకులు కూడా ఒకే అమ్మాయితో పాల్గొంటారు. డబ్బు చెల్లించినప్పటికీ సెక్స్ చేయని నాయకులు ఉన్నారు. అందుకే అమ్మాయిలను వారి అభిరుచికి తగ్గట్టుగా మేం పంపుతాం. అభ్యర్థులు ఎవరో చెప్పండి. హై ప్రొఫైల్ అమ్మాయిలతో ఎంజాయ్ చేసే బాధ్యత మాది’ అని ఆమె అన్నది.
మరోవైపు బీహార్ అసెంబ్లీల ఎన్నికల్లో బీజేపీ కేంద్ర నాయకత్వం తనకు పెద్ద బాధ్యత అప్పగించినట్లు ఫూల్ జోషి తెలిపింది. తన పనిని ఇది మరింత సులభం చేస్తుందని చెప్పింది. ‘ప్రతిచోటా మా ప్రభావం ఉంది. ప్రతి పార్టీలోనూ మా వాళ్లు ఉన్నారు. కాబట్టి నా వైపు నుంచి మీరు నిశ్చింతగా ఉండవచ్చు. ఎవరూ మమ్మల్ని ప్రశ్నించలేరు. పార్టీ ఎమ్మెల్యేలకు కూడా దీని గురించి తెలుసు. కానీ అడిగే ధైర్యం ఎవరికీ లేదు. సాధారణ నాయకురాలిగా నన్ను పరిగణించవద్దు. చాలా మంది పెద్ద నాయకులు నాతో కాంటాక్ట్‌లో ఉన్నారు’ అని చెప్పింది.
కాగా, దైనిక్ భాస్కర్ బహిర్గతం చేసిన స్టింగ్ ఆపరేషన్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధి కాంచన యాదవ్ దీనిని ఎక్స్‌లో షేర్ చేశారు. ‘బీజేపీ నాయకుల వ్యూహాలు, పాత్ర, మహిళల పట్ల గౌరవం చూడండి’ అని విమర్శించారు. అయితే ఈ స్టింగ్ ఆపరేషన్ వీడియోపై బీజేపీ లేదా ఫూల్ జోషి ఇంకా స్పందించలేదు.
भाजपा नेताओं का चाल, चरित्र, चेहरा और महिलाओं के प्रति सम्मान देखिए। दैनिक भास्कर की रिपोर्ट ने जो खुलासा किया है, उसे तो मैं लिख भी नहीं पा रही हूँ। आप ही पूरा वीडियो सुन लीजिए। pic.twitter.com/nDdoQxvf8c
— Kanchana Yadav (@Kanchanyadav000) November 4, 2025
Also Read:
Watch: ఎయిర్‌పోర్టులో ఎదురుపడిన తేజ్ ప్రతాప్, తేజస్వి యాదవ్.. తర్వాత ఏం జరిగిందంటే?
Farmer Sets Himself On Fire | నిప్పంటించుకుని రైతు ఆత్మహత్య.. కర్ణాటకలో ఘటన
Hindus Denied Entry By Pak | భారతీయ హిందువులను.. వెనక్కి పంపిన పాక్