పాట్నా: కుటుంబపరంగా, రాజకీయంగా విడిపోయిన సోదరులైన తేజ్ ప్రతాప్, తేజస్వి యాదవ్ (Tej Pratap, Tejashwi) బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరిపై మరొకరు తలపడుతున్నారు. అయితే అన్నాదమ్ములైన వీరిద్దరూ అనుకోకుంటా పాట్నా ఎయిర్‌పోర్ట్‌లో ఎదురుపడ్డారు. కొంతసేపు దగ్గరగా ఉన్నప్పటికీ తేజ్ ప్రతాప్, తేజస్వి యాదవ్ మాట్లాడుకోలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆర్జేడీతో పాటు కుటుంబం నుంచి బహిష్కరణ తర్వాత జనశక్తి జనతాదళ్ పార్టీని తేజ్ ప్రతాప్ ఏర్పాటు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 22 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఆర్జేడీకి పట్టున్న రాఘోపూర్‌లో తమ్ముడు తేజస్విపై తన పార్టీ అభ్యర్థిని పోటీలో దించారు.
కాగా, బుధవారం ఉదయం పాట్నా ఎయిర్‌పోర్ట్‌కు తేజ్ ప్రతాప్ చేరుకున్నారు. తమ్ముడు తేజస్వి గురించి ప్రతిసారి తనను ఎందుకు అడుగుతున్నారంటూ అక్కడున్న మీడియాపై మండిపడ్డారు. ఎయిర్‌పోర్ట్‌లోకి ప్రవేశించిన తర్వాత ఒక స్టోర్‌లోకి వెళ్లి దుస్తులను పరిశీలించారు.
మరోవైపు తేజస్వి యాదవ్ కూడా ఆ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. గమనించిన తేజ్ ప్రతాప్ అనుచరుడు ఆయనకు ఈ విషయం చెప్పాడు. యూట్యూబర్ సమ్దీష్ తెలిసిన వ్యక్తి కావడంతో తేజస్వి యాదవ్ చేయి ఊపారు. ‘అన్న (తేజ్ ప్రతాప్) ఎదైనా కొంటున్నారా?’ అని అడిగారు. తనకు గిఫ్ట్ ఇస్తున్నారని ఆయన చెప్పగా ‘నువ్వు చాలా లక్కీ’ అని తేజస్వి అన్నారు.
కాగా, తేజస్వి యాదవ్ అక్కడి నుంచి వెళ్తుండగా తేజ్ ప్రతాప్ ఆయన వంక చూశారు. ఆ తర్వాత స్టోరులోకి వెళ్లారు. ‘తేజస్వితో మాట్లాడటం లేదా?’ అని యూట్యూబర్ అడిగినప్పుడు తేజ్ ప్రతాప్ మొదట సైలెంట్‌గా ఉన్నారు. ఆ తరువాత ‘ఆయన బాగానే ఉన్నాడు’ అని అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
GoAted cameo at 00:30
Teju bhaiya’s face when he saw Tejashwi is pure cinema🔥🔥🔥 pic.twitter.com/19o88cvpcS
— Avishek Goyal (@AG_knocks) November 4, 2025
Also Read:
Hindus Denied Entry By Pak | భారతీయ హిందువులను.. వెనక్కి పంపిన పాక్
Watch: ఉద్దేశపూర్వకంగా బైక్‌ను ఢీకొట్టిన క్యాబ్ డ్రైవర్.. వీడియో వైరల్
Watch: పెంపుడు కుక్కను లిఫ్ట్‌లో చంపిన పనిమనిషి.. వీడియో వైరల్