బెంగళూరు: భూ వివాదాన్ని ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో రైతు విసిగిపోయాడు. ప్రభుత్వ కార్యాలయం వద్ద నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలిన గాయాలైన ఆ రైతును ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. (Farmer Sets Himself On Fire) కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. మాండ్య జిల్లాకు చెందిన రైతు మంజెగౌడకు అటవీ ప్రాంతానికి అనుకుని పొలం ఉన్నది. అయితే అది తమ స్థలమంటూ ఆ రాష్ట్ర అటవీ శాఖతోపాటుతోపాటు ముగ్గురు స్థానికులు తనను వేధిస్తున్నట్లు రైతు ఆరోపించాడు. వ్యవసాయం చేసుకోనివ్వడం లేదని వాపోయాడు.
కాగా, అక్టోబర్ 18న రైతు మంజెగౌడ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. భూమి వివాదం గురించి ఫిర్యాదు చేశాడు. తాను బ్యాంకు నుంచి అప్పు కూడా తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అధికారులు స్పందించకపోవడంతో నవంబర్ 4న జిల్లా పరిపాలన కార్యాలయానికి చేరుకున్నాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
మరోవైపు స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించారు. మంటలు ఆర్పివేశారు. కాలిన గాయాలైన రైతు మంజెగౌడను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు.
ఈ సంఘటన కర్ణాటకలో కలకలం రేపింది. ఈ విషయంపై మాండ్య డిప్యూటీ కమిషనర్ స్పందించారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ సంఘటన దురదృష్టకరమని ఆ రాష్ట్ర అటవీ మంత్రి ఈశ్వర్ ఖండ్రే అన్నారు. తన శాఖ అధికారుల నుంచి నివేదిక కోరినట్లు తెలిపారు.
Also Read:
Watch: ఎయిర్‌పోర్టులో ఎదురుపడిన తేజ్ ప్రతాప్, తేజస్వి యాదవ్.. తర్వాత ఏం జరిగిందంటే?
Hindus Denied Entry By Pak | భారతీయ హిందువులను.. వెనక్కి పంపిన పాక్
Watch: పెంపుడు కుక్కను లిఫ్ట్‌లో చంపిన పనిమనిషి.. వీడియో వైరల్