న్యూఢిల్లీ: ఒక యువతి నిప్పంటించుకున్నది. కాలిన గాయాలతో మరణించింది. సమీపంలోని ఇంట్లో ఒక వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (Teen Set On Fire, Man Hanging) అయితే వీరిద్దరి మృతికి కారణాలు ఏమిటి? వారిద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉన్నదా? అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం రన్హోలా ప్రాంతంలో 17 ఏళ్ల యువతి ఒంటికి నిప్పంటించుకున్నది. తీవ్ర కాలిన గాయాలైన ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.
కాగా, యువతి నిప్పంటించుకున్న వీధి సమీపంలోని ఇంటిలో అదే రోజున ఒక వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు రెండు చోట్లకు చేరుకున్నారు. ఇద్దరి మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు కుటుంబంలో గొడవ వల్ల ఆ యువతి నిప్పంటించుకున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. అయితే ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి, ఆమె మధ్య ఏమైనా సంబంధం ఉన్నదా? అన్నది దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఇద్దరి ఆత్మహత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.
Also Read:
BJP Leader Phool Joshi | బీజేపీ నాయకురాలి ‘సెక్స్ రాకెట్’ గుట్టురట్టు.. ఆర్జేడీ మండిపాటు
Farmer Sets Himself On Fire | నిప్పంటించుకుని రైతు ఆత్మహత్య.. కర్ణాటకలో ఘటన
Watch: ఎయిర్పోర్టులో ఎదురుపడిన తేజ్ ప్రతాప్, తేజస్వి యాదవ్.. తర్వాత ఏం జరిగిందంటే?