Supreme Court | టీమ్ ఇండియా క్రికెటర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami) నుంచి తనకు భరణం పెంచాలంటూ ఆయన మాజీ భార్య హసిన్ జహాన్ (Hasin Jahan) వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court)లో ఇవాళ విచారణ జరిగింది. ఈ మేరకు షమీ, బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
భార్య హసిన్ జహాన్ (Hasin Jahan)తో పాటు కూతురికి ప్రతి నెలా (monthly maintenance) రూ.4 లక్షలు (alimony) ఇవ్వాలని కోల్‌కతా హైకోర్టు (Calcutta High Court) ఈ ఏడాది జులైలో ఆదేశించిన విషయం తెలిసిందే. మెయింటేనెన్స్లో భాగంగా ఆ అమౌంట్ ఇవ్వాలని కోర్టు తన తీర్పులో పేర్కొన్నది. ఇందులో భార్యకు రూ.1.5 లక్షలు, కూతురికి రూ.2.5 లక్షలు ఇవ్వాలని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. అయితే, కోర్టు తీర్పుపై హసిన్ అసహనం వ్యక్తం చేసింది. తాము రూ.10 లక్షలు డిమాండ్ చేశామని పేర్కొంది. ఈ మేరకు కోల్‌కతా హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆదాయం, ఖర్చులు పెరిగాయని, షమీ ఎలా జీవితాన్ని గడుపుతున్నారో.. తానూ, తన కూతురు కూడా అదే రీతిలో కొనసాగించే హక్కు ఉందని పిటిషన్లో పేర్కొంది.
దీనిపై సుప్రీంకోర్టు తాజాగా విచారణ చేపట్టింది. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నెలకు రూ.4లక్షలు అంటే పెద్ద అమౌంట్ కాదా..?’ అంటూ సూటిగా ప్రశ్నించింది. ఈ మేరకు హసిన్ అభ్యర్థనపై స్పందన తెలియజేయాలని షమీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్‌కు వాయిదా వేసింది.
షమీ-హసీన్ 2014లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఒక కుమార్తె ఉంది. అయితే ఈ దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 2018లో షమీపై హసీన్ గృహ హింస, దాడి, వరకట్న వేధింపులు వంటి ఆరోపణలు చేసింది. ఈ విషయమై హసీన్ కోర్టును ఆశ్రయించింది. దీంతో షమీపై దాడి, హత్యాయత్నం, గృహ హింస తదితర అభియోగాలపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే 2019 ఆగస్టులో కోల్‌కతాలోని అలిపోర్ కోర్టు.. క్రికెటర్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే దీన్ని షమీ సెషన్స్ కోర్టులో సవాల్ చేయగా.. అరెస్టు వారెంట్, క్రిమినల్ విచారణ ప్రక్రియపై స్టే విధిస్తూ 2019 సెప్టెంబర్‌లో సెషన్స్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉండగా.. షమీపై గృహహింస కేసు నమోదు చేసినప్పుడు.. తనకు భరణం కింద నెలకు రూ.10 లక్షలు ఇవ్వాలని ఆమె కోర్టులో కేసు వేసింది. అందులో రూ.7 లక్షలు తన ఖర్చుల నిమిత్తం కాగా, మరో రూ.3 లక్షలు కుమార్తె కోసమని పేర్కొంది. దీనిపై ఈ ఏడాది జనవరిలో విచారణ జరిపిన కోల్‌కతా హైకోర్టు.. హసీన్ (Hasin Jahan)కు భరణం కింద ప్రతి నెలా రూ.1.30లక్షలు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రూ.50వేలు హసీన్‌కు కాగా, మరో రూ.80వేలు కుమార్తె బాగోగుల కోసం చెల్లించాల్సిందిగా ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఆ తర్వాత నెలకు రూ.4లక్షలు ఇవ్వాల్సిందిగా షమీని హైకోర్టు ఆదేశించింది. దీనిపై హసిన్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
Also Read..
Jewellery | కళ్లలో కారం కొట్టి బంగారం చోరీకి యత్నం.. మహిళను చితకబాదిన దుకాణం యజమాని.. VIDEO