Supreme Court | ఈ ఏడాది జూన్‌లో అహ్మదాబాద్ (Ahmedabad)లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ టేకాఫ్ అయిన నిమిషాల్లోనే ఓ బిల్డింగ్‌పై కూలిపోయింది. ఈ ఘటనలో కెప్టెన్ సుమీత్, కో-పైలట్ క్లైవ్ కుందర్ సహా విమానంలో ఉన్న దాదాపు 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై న్యాయస్థానం పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తును జరపాలంటూ ప్రమాదంలో మృతి చెందిన కెప్టెన్ సుమీత్ సభర్వాల్ (Captain Sumeet Sabharwal) తండ్రి పుష్కర్ రాజ్ సభర్వాల్ (91) సుప్రీం కోర్టు (Supreme Court)ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.
దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు సానుభూతి వ్యక్తం చేస్తూ.. ఈ విషాదానికి మీ కొడుకుని నిందించడం లేదని తెలిపింది. ‘ఈ ప్రమాదం పైలట్ తప్పు అని దేశంలో ఎవరూ నమ్మడం లేదు. మీ కుమారుడిని నిందిస్తున్న భారాన్ని మీరు మోయకూడదు’ అని వ్యాఖ్యానించింది. ‘ఈ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం. మీ కుమారుడిని నిందిస్తున్న భారాన్ని మీరు మోయకూడదు. అతడిని ఎవరూ నిందించలేరు. పైలట్ తప్పు అని దేశంలో ఎవరూ నమ్మడం లేదు. ఇప్పటి వరకూ పైలట్‌పై ఎలాంటి ఆరోపణలూ లేవు. దర్యాప్తులో ఇద్దరు పైలట్ల మధ్య సంభాషణ మాత్రమే బయటకు వచ్చింది’ అని పేర్కొంది.
Also Read..
Jewellery | కళ్లలో కారం కొట్టి బంగారం చోరీకి యత్నం.. మహిళను చితకబాదిన దుకాణం యజమాని.. VIDEO
Delhi Airport | ఢిల్లీ ఏటీసీలో సాంకేతిక సమస్య.. 100కుపైగా విమానాలు ఆలస్యం