కొలంబో: అర్జున రణతుంగ గుర్తున్నారా? శ్రీలంక మాజీ కెప్టెన్ ఇప్పుడు వెయిట్‌లాస్ అయ్యారు. స్టన్నింగ్ రీతిలో అతను మారిపోయాడు. భారీ కాయంతో ఉండే రణతుంగ.. చాలా సన్నగా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలో ఎరుపు రంగు కుర్తా వేసుకున్న వ్యక్తే రణతుంగ. 1996 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన శ్రీలంక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు అర్జున రణతుంగ. అయితే ఈ ఫోటోను షేర్ చేసింది మరో మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య. డ్యాషింగ్ బ్యాటర్ జయసూర్య ఈ ఫోటోను షేర్ చేయడం వల్ల .. ఆ రెడ్ కుర్తాలో ఉన్నది అర్జున రణతుంగ అని ఎవరూ నమ్మలేకపోతున్నారు. ఆ ఇద్దరితో పాటు అప్పటి మేటి బ్యాటర్ అరవింద డిసిల్వా, స్పిన్నర్ మురళీధరన్ కూడా ఉన్నారు.
అర్జున రణతుంగ ఫోటోను చూసిన జనం ఆశ్చర్యపోతున్నారు. బహుశా అతనికి ఏమైనా వ్యాధి సోకిందేమో అన్న అభిప్రాయాలను కొందరు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. తమిళ యూనియన్ 125వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆ ఫోటో దిగారు. మహా బలశాలిగా కనిపించే రణతుంగ ఇలా మారిపోయేడేంటి అని కొందరు నివ్వెరపోతున్నారు. జూలై 2000 సంవత్సరంలో రణతుంగ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి సిన్హలా ఉరుమయ పార్టీ తరపున గెలిచారు.
1996 వరల్డ్‌కప్ ఫైనల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 241 రన్స్ చేసింది. ఆసీస్ బ్యాటర్లలో మార్క్ టేలర్ 74, రికీ పాంటింగ్ 45 రన్స్ చేశారు. ఇక 242 రన్స్ టార్గెట్‌తో చేజింగ్‌కు దిగిన శ్రీలంకకు ఆరంభంలో షాక్ తగిలింది. ఆ జట్టు 23 రన్స్‌కే రెండు వికెట్లను కోల్పోయింది. ఆ దశలో గురుసిన్హా, అరవింద డిసిల్వా కీలక ఇన్నింగ్స్ ఆడారు. గురుసిన్హా 65, డిసిల్వా 107 రన్స్ చేశారు. కెప్టెన్ అర్జున రణతుంగ 37 బంతుల్లో 47 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో ఏడు వికెట్ల తేడాతో లంక విజయాన్ని నమోదు చేసి ట్రోఫీ ఎగురేసుకుపోయింది.
🇱🇰🏏 pic.twitter.com/H28ZlVZRhX
— Sanath Jayasuriya (@Sanath07) November 5, 2025