నార్నూర్ : గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలు( Medical Service) అందేలా చూడాలని అడిషనల్ డీఎంహెచ్ఓ కుడ్మెత మనోహర్( Manohar ) వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రసూతి గది, రికార్డులను పరిశీలిస్తూ వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖానా లోనే ప్రసవాలు అయ్యేలా గర్భిణులను ప్రోత్సహించాలని సూచించారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతినెల ఆరోగ్య పరీక్షలు తప్పకుండా నిర్వహించాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ ఆరోగ్య అధికారి లక్ష్మి, ఆరోగ్య విస్తరణ అధికారి చౌహన్ తులసీదాస్, హెల్త్ సూపర్వైజర్ చౌహాన్ చరణ్ దాస్, వైద్య సిబ్బంది నాందేవ్, సుశీల, సత్యవ్వ, కైలాస్, ఈశ్వర్, జవహార్ లాల్, గూగుల్, దినేష్, ప్రియాంక తదితరులున్నారు.