ఆగస్టు నాటికి 470 మిలియన్ డోసుల సరఫరా: వీకే పాల్
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ నుంచి కొవిడ్ -19 వ్యాక్సిన్ల సరఫరా జూలై-ఆగస్టు నాటికి పెరిగే అవకాశం ఉన్నదని నితీ ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ వీకే పాల్ చెప్పారు.

న్యూఢిల్లీ: సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ నుంచి కొవిడ్ -19 వ్యాక్సిన్ల సరఫరా జూలై-ఆగస్టు నాటికి పెరిగే అవకాశం ఉన్నదని నితీ ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ వీకే పాల్ చెప్పారు.
సీరం ఇన్స్టిట్యూట్ నెలకు 60 మిలియన్ మోతాదులను తయారు చేస్తుందని, వచ్చే ఆగస్టు నాటికి 470 మిలియన్ మోతాదులను సరఫరా చేసే స్థితిలో ఉంటుందని వీకే పాల్ మంగళవారం చెప్పారు. నిన్న ఒక్క రోజే మూడు మిలియన్ల మందికి టీకాలు వేయగలిగామని, ట్రాక్‌లో ఉన్నామని తెలిపారు.
భారతదేశంలో కొవిడ్-19 పై సన్ ఫార్మా సైన్స్ ఫౌండేషన్ ఆన్లైన్ వార్షిక సమావేశంలో కొవిడ్-19 టీకా కార్యక్రమం, తయారీ సంస్థల్లో ఉత్పత్తి సామర్థ్యం, భారతదేశం లక్ష్యాలను చేరుతుందా? అనే ప్రశ్నలకు పాల్ సమాధానమిచ్చారు.
ఈ సమావేశాన్ని హర్యానా సోనెపట్‌లో ఉన్న అశోక విశ్వవిద్యాలయంకు చెందిన త్రివేది స్కూల్ ఆఫ్ బయోసైన్సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ షాహిద్ జమీల్ కోఆర్డినేట్ చేశారు.
దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాక్సిన్ డోసులు వేయడం 5 కోట్లకు చేరుకుంటుందని.. 2 కోట్లకు పైగా లబ్ధిదారులు 60 ఏండ్ల వయసు పైబడిన వారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గణాంకాలు చెప్తున్నాయి.
కోవిషీల్డ్-కోవాక్సిన్ యొక్క వాడకంపై అడిగిన ప్రశ్నకు పాల్ సమాధానమిస్తూ.. ఈ అసమానత ప్రధానంగా సరఫరా సమస్యకు సంబంధించినదన్నారు. కోవాక్సిన్ తక్కువ దుష్ప్రభావాలను కలిగి ఉన్నదని ఆయన చెప్పారు.
‘ఎస్ఐఐ, భారత్ బయోటెక్ రెండూ పరిమిత సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. రెండూ వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నిస్తున్నాయి. టీకాల్లో క్రమబద్ధమైన పెరుగుదల ఉండాలి. భారత్ బయోటెక్ కూడా ఆగస్టు నాటికి 120-130 మిలియన్ మోతాదుల కోవాక్సిన్ సరఫరా చేయగలగాలి’ అని పాల్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
కొవిడ్ నియంత్రణకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు
ప్రీపోల్ సర్వేలను చూసి అలసత్వం వద్దు : పినరయి విజయన్
ఫేస్బుక్ కొత్త రిస్ట్‌బ్యాండ్.. మెదడుతో కంప్యూటర్ల నియంత్రణ
మోదీ 115 స్కీంలు తెస్తే.. మమతా 115 స్కాంలు చేశారు : అమిత్‌షా
ట్యాక్స్ సేవింగ్స్ చేయాలా..? ఈ టిప్స్ పాటించండి!
ఇది యూఎఫ్ఓ కాదు.. రష్యా కార్గో ఎయిర్‌షిప్..!
ఆర్టిస్ట్ లండన్‌లో.. మహిళ నెదర్లాండ్స్‌లో.. 5 జీ టెక్నాలజీ టాటూ
భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్దేవ్ల ఉరితీత.. చరిత్రలో ఈరోజు
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Covid vaccine
- VK Paul
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

