ఆర్టిస్ట్ లండన్‌లో.. మహిళ నెదర్లాండ్స్‌లో.. 5 జీ టెక్నాలజీ టాటూ
లండన్‌కు చెందిన ఓ టాటూ కళాకారుడు కొత్త టెక్నాలజీని తయారుచేశారు. తాను లండన్‌లో కూర్చుని ఉండి.. నెదర్లాండ్స్‌లో ఉన్న మహిళకు 5 జీ టెక్నాలజీ ద్వారా టాటూ వేసి కొత్త రికార్డు సృష్టించారు.

లండన్ : ఇవాళ టాటూలు వేసుకోవడం ప్రతీ ఒక్కరికి ఫ్యాషన్‌గా మారింది. టాటూ వేసుకోవాలంటే మనమే ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే, ఆర్టిస్ట్ వద్దకు వెళ్లి కూర్చోవాల్సిన అవసరం లేకుండా లండన్‌కు చెందిన ఓ టాటూ కళాకారుడు కొత్త టెక్నాలజీని తయారుచేశారు. తాను లండన్‌లో కూర్చుని ఉండి.. నెదర్లాండ్స్‌లో ఉన్న మహిళకు 5 జీ టెక్నాలజీ ద్వారా టాటూ వేసి కొత్త రికార్డు సృష్టించారు.
ఇదే ప్రపంచంలోని తొలి రిమోట్ టాటూగా రికార్డులకెక్కింది. 483 కిలోమీటర్ల దూరంలోని నగరంలో ఉన్న వ్యక్తికి రోబోటిక్ రిమోట్ ద్వారా పచ్చ పొడిచి లండన్ టాటూ కళాకారుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపారు.
5 జీ టెక్నాలజీతో కూడిన రియల్‌టైమ్ రోబోటిక్ ఆర్మ్‌తో టాటూ వేసే సాంకేతికతను లండన్‌కు చెందిన నోయెల్ డ్రూ తయారు చేశారు. ఈ టెక్నాలజీకి ‘ఇంపాజిబుల్ టాటూ’ అని పేరు పెట్టారు.
పచ్చబొట్టు కళాకారుడు వెస్ థామస్ తన చేతిలో ఉన్న డిజైన్‌ను రూపొందించడానికి ఈ పరికరాన్ని వందసార్లు పరిశీలించాడు. నెదర్లాండ్స్ నటి స్టిన్ ఫ్రాన్సెన్ మణికట్టు మీద టాటూ వేసి తొలి రిమోట్ వేసిన కళాకారుడుగా వెస్ థామస్ నిలిచారు.
లాక్డౌన్ లాక్డౌన్ సమయంలో సుమారు 6 వారాల సమయంలో ఈ సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తులకు కూడా టాటూ వేయడం సులభం చేసింది. ఈ టెక్నాలజీకి సంబంధించిన చాలా వస్తువులు ఇంట్లోనే తయారు చేసుకున్నామని, కొన్నింటిని బయటి నుంచి కొనుగోలు చేసుకున్నట్లు నోయెల్ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్దేవ్ల ఉరితీత.. చరిత్రలో ఈరోజు
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

