కరోనా నియంత్రణకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు
covid | కరోనా వైరస్ నియంత్రణ, జాగ్రత్తల కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు వచ్చే నెల 1 వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.

న్యూఢిల్లీ : కరోనా వైరస్ నియంత్రణ, జాగ్రత్తల కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు వచ్చే నెల 1 వ తేదీ నుంచి అమల్లోకి వచ్చి.. ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటాయి.
దేశంలోని అనేక ప్రాంతాల్లో covid కేసులు పెరుగుతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. టెస్ట్-ట్రాక్-ట్రీట్ ప్రోటోకాల్‌ను ఖచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
పొరుగు దేశాలతో ఒప్పందాల ప్రకారం భూ సరిహద్దు వాణిజ్యానికి అడ్డంగా ఉన్న వ్యక్తులు, వస్తువుల అంతర్రాష్ట్ర కదలికలపై ఎటువంటి పరిమితి ఉండకూడదని కేంద్రం తన ఉత్తర్వుల్లో పేర్కొన్నది. అటువంటి కదలికలకు ప్రత్యేక అనుమతి / ఆమోదం / ఈ-పర్మిట్ అవసరం లేదని ఎంహెచ్ఏ తెలిపింది.
కొవిడ్-19 కేసులలో తాజా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని దేశంలోని అన్ని ప్రాంతాలలో టెస్ట్-ట్రాక్-ట్రీట్ ప్రోటోకాల్‌ను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
ప్రతిఒక్కరూ కొవిడ్ ప్రోటోకాల్ పాటించాలని, నిర్ణీత దూరం పాటిస్తూనే ముక్కుకు తప్పనిసరిగా మాస్కులను వాడాలని కోరింది. టీకాల డ్రైవ్‌ను పెంచడానికి, అన్ని లక్ష్య సమూహాలను కవర్ చేయడానికి రాష్ట్ర / కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వం సహకరించాలని సూచించింది.
covid నిబంధనలు తప్పనిసరి
ఆర్టీ-పీసీఆర్ పరీక్షల నిష్పత్తి తక్కువగా ఉన్న రాష్ట్రాలు, యూటీలు వీటి విషయంలో వేగంగా పెంచాలని, నిర్ణీత స్థాయి 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ స్థాయికి చేరుకోవాలన్నది. ఇంటెన్సివ్ టెస్టింగ్ ఫలితంగా గుర్తించిన వారిని ఐసోలోషన్‌లో ఉంచి వారికి సకాలంలో చికిత్స అందించాలని ఎంహెచ్ఏ తెలిపింది.
అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో, రద్దీ ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా ప్రోత్సహించేలా చూడాలని రాష్ట్రాలు, యూటీ ప్రభుత్వాలను కోరారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై తగిన జరిమానాలు విధించడంతో పాటు పరిపాలనా చర్యలను తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఇవి కూడా చదవండి..
ప్రీపోల్ సర్వేలను చూసి అలసత్వం వద్దు : పినరయి విజయన్
ఫేస్బుక్ కొత్త రిస్ట్‌బ్యాండ్.. మెదడుతో కంప్యూటర్ల నియంత్రణ
మోదీ 115 స్కీంలు తెస్తే.. మమతా 115 స్కాంలు చేశారు : అమిత్‌షా
ట్యాక్స్ సేవింగ్స్ చేయాలా..? ఈ టిప్స్ పాటించండి!
ఇది యూఎఫ్ఓ కాదు.. రష్యా కార్గో ఎయిర్‌షిప్..!
ఆర్టిస్ట్ లండన్‌లో.. మహిళ నెదర్లాండ్స్‌లో.. 5 జీ టెక్నాలజీ టాటూ
భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్దేవ్ల ఉరితీత.. చరిత్రలో ఈరోజు
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

