ఇది యూఎఫ్ఓ కాదు.. రష్యా కార్గో ఎయిర్‌షిప్..!
రష్యాకు చెందిన ఎయిర్‌షిప్ తయారీదారు ఎయిర్‌షిప్ ఇనిషియేటివ్ డిజైన్ బ్యూరో ఏరోస్మెనా (ఏఐడీబీఏ).. కార్గో ఎయిర్‌షిప్‌ను సిద్ధం చేసింది. చూడటానికి యూఎఫ్ఓ ఆకారంలో ఉండటంతో విశేషంగా ఆకర్శిస్తున్నది.

రష్యాకు చెందిన ఎయిర్‌షిప్ తయారీదారు ఎయిర్‌షిప్ ఇనిషియేటివ్ డిజైన్ బ్యూరో ఏరోస్మెనా (ఏఐడీబీఏ).. కార్గో ఎయిర్‌షిప్‌ను సిద్ధం చేసింది. చూడటానికి యూఎఫ్ఓ ఆకారంలో ఉండటంతో విశేషంగా ఆకర్శిస్తున్నది.
2024 లో సాసర్ ఆకారంలో 600 టన్నుల పేలోడ్ ఎయిర్‌షిప్‌ను ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ సంస్థ యొక్క కార్గో ఎయిర్‌షిప్ భూమి మౌలిక సదుపాయాలతో సంబంధం లేకుండా మైదానంలో లోడింగ్, అన్లోడింగ్ కార్యకలాపాలను నిర్వహించేలా రూపొందించారు.
ఈ ఏరోస్మెనాను తయారుచేయాలని రష్యన్ ఎయిర్‌క్రాఫ్ట్ డిజైనర్ ఓర్ఫీ కోజ్లోవ్ భావించారు. అయితే, గత ఏడాది కొవిడ్-19కు గురై కన్నుమూశారు. ఈ కార్గో ఎయిర్‌షిప్‌ను నడిపేందుకు ఓడరేవులు, రహదారులు, విమానాశ్రయాలు లేదా రన్వేలు అవసరం లేదు. ఇది భూభాగంపై పనిచేస్తూ కప్పి వ్యవస్థను ఉపయోగించి సరుకులను చేరవేస్తుంది.

“ఇటువంటి డిజైన్‌ను ఉపయోగించి డోర్ టు డోర్ వస్తువుల రవాణా సరళతరం చేశాం. ఇది లాజిస్టిక్స్, గిడ్డంగుల ఖర్చులను తగ్గించడానికి సహాయపడుతుంది” అని ఏరోస్మెనా సీఈఓ సెర్గీ వీ బెండిన్ చెప్పారు.
ఫ్లయింగ్-సాసర్ ఆకారానికి సంబంధించి వివరిస్తూ.. ఈ ఆకారం వల్ల తక్కువ శక్తితో నడపడం, ల్యాండ్ చేయడం సులభంగా ఉంటుందని బెండిన్ తెలిపారు. రానున్న రోజుల్లో ఇది అడవుల్లో విపరీతంగా వచ్చే మంటలను ఆర్పేందుకు కూడా వినియోగించుకోవచ్చునని బెండెన్ పేర్కొన్నారు.
ఎయిర్‌షిప్ రూపకల్పనలో లిఫ్ట్ అందించడానికి రెండు గ్యాస్ చాంబర్లు కూడా ఉన్నాయి.
600 టన్నుల మోడల్ కోసం 6,20,000 క్యూబిక్ మీటర్ల హీలియం ఆచరణాత్మకంగా “జీరో” తేలిక కోసం ఉపయోగించనున్నారు. ఎనిమిది హెలికాప్టర్ ఇంజిన్ల ఎగ్జాస్ట్ ద్వారా 200 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడిచేసిన గాలితో నిండిన పెద్ద కుహరం పేలోడ్‌ను ఎత్తడానికి బాధ్యత వహిస్తుందని ఏరోస్మెనా సంస్థ నిపుణులు వెల్లడించారు.

రానున్న రోజుల్లో వీటి అవసరం పెరిగే అవకాశాలు ఉండటంతో.. వివిధ మోడళ్లలో.. 20 టన్నుల నుంచి 600 టన్నుల కెపాసిటీతో గంటకు 250 కిలోమీటర్ల వేగంతో 8,000 కిలోమీటర్లు ప్రయాణించే సామర్ధ్యం ఉన్న కార్గో ఎయిర్‌షిప్‌లను తయారుచేయాలని ఏరోస్మెనా సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నది.
రానున్న రోజుల్లో సాసర్ ఆకారంలోని కార్గో ఎయిర్‌షిప్‌ల వాడకం పెరిగితే ప్రపంచంలోని ప్రధాన నగరాలన్నింటిపై వీటిని మరింత ఎక్కువగా వీక్షించే అవకాశం ఉంటుంది. గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ కు చెందిన ఎయిర్‌షిప్ సంస్థ కూడా కొత్త రకం మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలుస్తున్నది.
ఇవి కూడా చదవండి..
ఆర్టిస్ట్ లండన్‌లో.. మహిళ నెదర్లాండ్స్‌లో.. 5 జీ టెక్నాలజీ టాటూ
భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్దేవ్ల ఉరితీత.. చరిత్రలో ఈరోజు
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Cargo Airship
- UFO
RELATED ARTICLES
తాజా వార్తలు
రుణ మోసం కేసు దర్యాప్తు అధికారం ఈడీకి ఉన్నది: హైకోర్టు
ప్లంబర్ విమానాన్ని దించగలడా?
కశ్మీర్ బస్సులపై రెండ్రోజుల్లో రెండు దాడులు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

