దేశంలో డిసెంబర్ నాటికి 20కోట్ల కోవోవాక్స్ టీకాల లభ్యత!
దేశంలో డిసెంబర్ నాటికి 20కోట్ల కోవోవాక్స్ టీకాల లభ్యత! | అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ నోవావాక్స్ కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో కోవోవాక్స్ పేరిట సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేయనుంది.

న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ నోవావాక్స్ కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో కోవోవాక్స్ పేరిట సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేయనుంది. నానో-పార్టికల్ ప్రోటీన్-ఆధారిత టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో 90.4శాతం సామర్థ్యం చూపిందని కంపెనీ పేర్కొంది. అయితే, ఆగస్ట్ – డిసెంబర్ మధ్య కాలంలో దేశంలో 20 కోట్ల మోతాదుల కోవోవాక్సిన్ లభ్యత ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ఆశిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపిన తర్వాత.. వ్యాక్సిన్‌ను దేశంలోకి అనుమతించే అవకాశం ఉన్నది. పూణెకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద టీకా తయారీదారు కాగా.. ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు సీరం తమకు కీలకమైన భాగస్వామి అని నోవావాక్స్ పేర్కొంది.
కంపెనీ ప్రస్తుతం తయారు చేస్తున్న డోసుల సంఖ్య వెల్లడించనప్పటికీ.. నెలకు 50 మిలియన్ మోతాదులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. నోవోవాక్స్ టీకా ఎన్వీఎక్స్-కోవి 2373 మితమైన తీవ్రమైన కేసుల్లో వంద శాతం రక్షణ చూపిందని, మొత్తం 90.4శాతం ప్రభావవంతంగా పని చేస్తుందని కంపెనీ సీఈఓ స్టాన్లీ సీ ఎర్క్ అన్నారు. మూడో త్రైమాసికంలో అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేయాలని కంపెనీ భావిస్తోంది. వ్యాక్సిన్‌ను సాధారణ ఫ్రిడ్జ్‌లో ఈ టీకాలను నిల్వ చేయవచ్చని పేర్కొంది.
వ్యాక్సిన్ అనేక రకాల వేరియంట్లకు వ్యతిరేకంగా, ముఖ్యంగా యూకేలో కనుగొన్న వేరియంట్లపై ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు కంపెనీ చెప్పింది. వచ్చే ఏడాదిలో అమెరికాలో 110 మిలియన్ మోతాదులను, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మొత్తం 1.1 బిలియన్ మోతాదులను సరఫరా చేస్తామని కంపెనీ పేర్కొంది. కోవోవాక్స్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ భారత్‌లో ప్రారంభమయ్యాయని, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పంపిణీని ప్రారంభించాలని సీరం ఇన్స్టిట్యూట్ పూనావాలా గతంలో ప్రకటించారు. కంపెనీ ఇప్పటికే ఆస్ట్రాజెనెకా టీకాను కొవిషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
Oxygen Levels : ఇవి తినండి.. ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోండి
పెరుగుతో తినగూడని పదార్థాలు ఏవి? ఎందుకు?
ఢిల్లీలో రెండు హాస్పిటళ్లలో ‘స్పుత్నిక్-వీ’ పంపిణీ
త్వరలో దేశంలో అందుబాటులోకి మరో స్వదేశీ టీకా
రేపు తెరుచుకోనున్న చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలు
Delta effect : బ్రిటన్‌లో జూలై 19 వరకు ఆంక్షల పొడగింపు
నేడు కర్నల్ సంతోష్‌బాబు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న కేటీఆర్
దేశంలో 60వేలకు దిగివచ్చిన కరోనా కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

