KTR | ప్రతీ బూత్‌లో బీఆర్ఎస్ పార్టీకే మెజారిటీ.. సబితమ్మ గెలుపు తథ్యం : కేటీఆర్
KTR | మహేశ్వరంలో బీఆర్ఎస్ కార్యకర్తల జోష్ చూస్తుంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిపోయిన భావన కలుగుతోందని.. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయిపోయారని అనిపిస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
KTR | కార్యకర్తలే కథానాయకులై కదం తొక్కితే ప్రతి బూత్‌లో బీఆర్ఎస్ పార్టీకే మెజారిటీ వస్తదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం,ఎస్ఐఆర్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని కార్యకర్తలు అత్యంత సీరియస్‌గా తీసుకోవాలన్నారు.
అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. డిజిటల్ రూపంలో పార్టీ సభ్యత్వ నమోదును పెద్దఎత్తున విజయవంతం చేయండిప్రతి కార్యకర్తకు పార్టీ తరఫున ప్రత్యేక గుర్తింపు కార్డును ఇస్తామన్నారు. ఈ గుర్తింపు కార్డుతో కార్యకర్తలు ఎక్కడికెళ్లినా గౌరవం లభిస్తదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి… ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
సబితమ్మ గెలుపు తథ్యమని తేలిపోయింది..
మహేశ్వరంలో బీఆర్ఎస్ కార్యకర్తల జోష్ చూస్తుంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిపోయిన భావన కలుగుతోందని.. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయిపోయారని అనిపిస్తోందన్నారు. మహేశ్వరంలో మరోసారి సబితమ్మ గెలుపు తథ్యమని తేలిపోయింది. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలిసేది పక్కా . బ్రహ్మాండంగా బీఆర్ఎస్ గెలిచేది పక్కా.. రాష్ట్రంలో గులాబీ జెండా ఎగిరేది పక్కా తెలంగాణ నలుదిశలా ఒకే నినాదం మారుమోగుతోంది. అదే కాంగ్రెస్ పోవాలె.. కేసీఆర్ రావాలే. రాష్ట్రంలో వికాసం పోయింది.. విధ్వంసం, విషాదం మాత్రమే మిగిలిందన్నారు.
కేసీఆర్ కిట్ పోయింది.. కరెంటు కోతల కాలం వచ్చింది.రైతుబంధు పోయింది.. రాహుల్ బంధు వచ్చింది. రాష్ట్రంలో సంక్షేమ పథకాల పాతర.. కుంభకోణాల జాతర నడుస్తోంది. సీఎంగా రేవంత్ ఉన్నా.. ప్రజలు కేసీఆర్ తలుచుకుంటున్నరని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణలో ఉద్యమంలో మహేశ్వరం ముద్దుబిడ్డ సిరిపురం యాదయ్య ఓయూ వద్ద రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేశారు. ఎంతోమంది అమరవీరుల త్యాగాల స్ఫూర్తితోనే.. పదేళ్ల పాలన సాగింది. ప్రజాసంక్షేమం.. ప్రగతిపథం.. రెండు జోడెడ్లలా ముందుకు సాగాయి. ఇవాళ బీఆర్ఎస్ ఓడిపోవడం వల్ల ఎవరు నష్టపోయారో ఆలోచించండి. కేసీఆర్‌కు పదవులు కొత్త కాదు. ఎన్నో పదవులను త్యాగం చేశారని.. 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కేసీఆర్ సొంతం కేటీఆర్ పేర్కొన్నారు.
Read Also :
US Ambassador: వచ్చే ఏడాది ఇండియా పర్యటనకు ట్రంప్
Bengaluru: తలపై పడిన చెట్టు కొమ్మ.. కోమాలోకి వెళ్లిన బెంగుళూరు బైకర్.. వీడియో
Venkatesh | వెంకీమామకు ఇంత డిమాండ్ ఏంటి?.. వరుసగా క్యూ కడుతున్న స్టార్ డైరెక్టర్లు!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

