Cyber Crimes | రాయపోల్, ఆగస్టు 13 : సిద్దిపేట జిల్లా రాయపోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపోల్ గ్రామంలో సురక్షా నేత్ర కార్యక్రమంలో భాగంగా 10 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలను సీఐ ఏఎస్కే లతీఫ్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ ఎస్ఐ మానస గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఐ ఏఎస్కే లతీఫ్ మాట్లాడుతూ.. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాల నియంత్రణ, నేరాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించడం, ప్రజల భద్రతను మరింత మెరుగుపరచడం సాధ్యమవుతుందని తెలిపారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యత, నేరాల నివారణలో వాటి పాత్రపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లు, లింకులు, మోసపూరిత ఆన్లైన్ లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. గ్రామస్థుల భద్రతకు, సంబంధించిన నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గ్రామ పెద్దలు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాసంపల్లి రాజు. ఉప సర్పంచ్ హనుమంతు రాజు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
Ketogenic Diet | కీటోజెనిక్ డైట్ అంటే ఏమిటి.. భారతీయులకు ఇది సెట్ అవుతుందా..?
Amit Shah | అన్నింటికీ సమాధానం ఇస్తానన్న అమిత్ షా.. భయం లేదన్న రాహుల్ గాంధీ
FCRA Bill: జేపీసీకి ఎఫ్సీఆర్ఏ బిల్లు.. లోక్సభలో తీర్మానం పాస్