Bengaluru: తలపై పడిన చెట్టు కొమ్మ.. కోమాలోకి వెళ్లిన బెంగుళూరు బైకర్.. వీడియో
Bengaluru: బెంగుళూరులో విషాద ఘటన జరిగింది. బైక్ రైడ్ చేస్తూ వెళ్తున్న వ్యక్తి తలపై ఓ ఎండిన చెట్టు కొమ్మ పడింది. ఆ కొమ్మ బలంగా తలకు తగలడంతో అతను అక్కడే కిందపడిపోయాడు. ఈ ఘటన రాజాజినగర్‌లోని రామ్ మందిర్ రోడ్డుపై జరిగింది.
బెంగుళూరు: బెంగుళూరు(Bengaluru)లో విషాద ఘటన జరిగింది. బైక్ రైడ్ చేస్తూ వెళ్తున్న వ్యక్తి తలపై ఓ ఎండిన చెట్టు కొమ్మ పడింది. ఆ కొమ్మ బలంగా తలకు తగలగానే అతను అక్కడే కిందపడిపోయాడు. ఈ ఘటన రాజాజినగర్‌లోని రామ్ మందిర్ రోడ్డుపై జరిగింది. బాధితుడిని సతీశ్‌గా గుర్తించారు. హెల్మెట్ ధరించకుండా బైక్ రైడ్ చేస్తున్న అతను ఆఫీసుకు వెళ్తున్న సమయంలో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనకు చెందిన సీసీటీవీ ఫూటేజ్ రిలీజైంది.
హెల్మెట్ లేకపోవడం వల్ల ఆ కొమ్మ తలను గట్టిగా ఢీకొట్టింది. దీంతో అతను అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. స్థానికులు వెంటనే వచ్చి అతన్ని ఆస్పత్రికి తరలించారు. యశ్వంతపూర్‌లోని మణిపాల్ వర్సిటీలో చికిత్స చేశారు. బాధితుడికి సర్జరీ చేశారు. తొలుత కోమాలోకి వెళ్లిన అతను.. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిసింది.
Scared … death may kiss in anyway … Rajaji Nagar of Bengalore . Wear helmet and people also should behave properly pic.twitter.com/LKhGgFHp3Q
— Dr Srinubabu Gedela (@DrSrinubabu) June 27, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

