Venkatesh | వెంకీమామకు ఇంత డిమాండ్ ఏంటి?.. వరుసగా క్యూ కడుతున్న స్టార్ డైరెక్టర్లు!
Venkatesh | టాలీవుడ్లో ఫ్యామిలీ హీరో అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్. మూడు దశాబ్దాలకుపైగా తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న వెంకీమామ ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద తన స్టామినాను చాటుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలు సాధిస్తున్న విజయాలు చూస్తే, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఆయనకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది.
Venkatesh | టాలీవుడ్లో ఫ్యామిలీ హీరో అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్. మూడు దశాబ్దాలకుపైగా తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న వెంకీమామ ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద తన స్టామినాను చాటుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలు సాధిస్తున్న విజయాలు చూస్తే, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఆయనకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది. గతేడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా కొత్త రికార్డులు సృష్టించింది.
ఆ తర్వాత ఈ ఏడాది విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలో వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించి అభిమానులను అలరించారు. ఈ సినిమా కూడా మంచి వసూళ్లను సాధించడంతో వెంకటేష్ మార్కెట్ మరింత బలపడింది. ప్రస్తుతం వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఆదర్శకుటుంబం’ అనే ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ రచన, వెంకటేష్ ఫ్యామిలీ ఇమేజ్ కలిసొస్తే మరో బ్లాక్‌బస్టర్ ఖాయమనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఇక ‘ఎఫ్2’, ‘ఎఫ్3’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి విజయాల తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడితో వెంకటేష్ మరోసారి చేతులు కలిపారు. ఈ మల్టీస్టారర్ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.
రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ కథలో వినోదానికి పెద్దపీట వేస్తున్నట్లు సమాచారం. యాక్షన్ కంటే కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌నే ప్రధానంగా తీసుకుంటున్నట్లు దర్శకుడు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ‘బింబిసార’తో దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న వశిష్ట ప్రస్తుతం ‘విశ్వంభర’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత వెంకటేష్‌తో ఓ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. వశిష్ట చెప్పిన కథ వెంకటేష్‌కు బాగా నచ్చిందని, ఇప్పటికే ప్రాథమికంగా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్‌తో పాటు నల్లమలుపు శ్రీనివాస్ నిర్మించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘వెంకీ మామ’తో వెంకటేష్‌కు మంచి కమర్షియల్ హిట్ అందించిన దర్శకుడు బాబీ కొల్లి కూడా మరో కథను సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత బిజీ హీరోల్లో వెంకీమామ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

