నెలాఖరు దాకా పుణెలో వీకెండ్ లాక్డౌన్, నైట్కర్ఫ్యూ
వీకెండ్ లాక్డౌన్ | పెరుగుతున్న కొవిడ్ కేసులతో పుణె మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) నగరంలో పూర్తిస్థాయిలో వీకెండ్ లాక్డౌన్ ప్రకటించింది. ఈ నెల 30వ తేదీ వరకు లాక్డౌన్తో పాటు నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు పేర్కొంది.

పుణె : పెరుగుతున్న కొవిడ్ కేసులతో పుణె మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) నగరంలో పూర్తిస్థాయిలో వీకెండ్ లాక్డౌన్ ప్రకటించింది. ఈ నెల 30వ తేదీ వరకు లాక్డౌన్తో పాటు నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు పేర్కొంది. నగరంలో అత్యవసర సేవలు, దుకాణాలు మినహాయించి మిగతా వాటన్నింటిని మూసివేయనున్నట్లు చెప్పింది. వారాంతపు లాక్డౌన్లో భాగంగా శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.
ఇందులో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు అన్ని దుకాణాలు, మార్కెట్లు మూతపడనున్నాయి. ఇప్పటికే నగర పరిధిలో హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లను మూసివేసింది. సహకార, ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు, బీమా సంస్థలు, టెలికాం, ఐటీ సంస్థలు, న్యాయవాదులు, సీఏలతో పాటు ఇర్థిక సంస్థలకు సంబంధించిన కార్యాలయాలు తెరిచే ఉండనున్నాయి. పుణె జిల్లాలో గురువారం కొత్తగా 12వేల పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,16,127కు చేరగా.. ఇప్పటి వరకు 10,472 మంది మృత్యువాతపడ్డారు.
ఇవి కూడా చదవండి..
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ఒకరు మృతి
శంషాబాద్లో విమానాశ్రయంలో విదేశీ బంగారం పట్టివేత
రాష్ట్రానికి నేడు వర్ష సూచన
ఢిల్లీలో 37 మంది వైద్యులకు కరోనా
సువేందు అధికారికి ఈసీ నోటీసులు
తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు
దేశంలో కరోనా విలయం.. 24 గంటల్లో 1.31లక్షల కేసులు
‘వ్యాక్సిన్ల భద్రత’పై ప్రభుత్వ కమిటీ సమీక్ష
ఐఐటీ రూర్కీలో 90 మంది విద్యార్థులకు కరోనా
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

