e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 12, 2021
Advertisement
Home News ఐఐటీ రూర్కీలో 90 మంది విద్యార్థులకు కరోనా

ఐఐటీ రూర్కీలో 90 మంది విద్యార్థులకు కరోనా

ఐఐటీ రూర్కీలో 90 మంది విద్యార్థులకు కరోనా

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) రూర్కీలో 90 మంది విద్యార్థులు కరోనా పాజిటివ్‌గా తేలారు. మొన్నటి వరకు 60 మంది విద్యార్థులు వైరస్‌ బారినపడగా.. తాజాగా మరో 30 మంది విద్యార్థులు పాజిటివ్‌గా పరీక్షించినట్లు ఐఐటీ మీడియా సెల్ ఇన్‌చార్జి సోనికా శ్రీవాస్తవ పేర్కొన్నారు. హరిద్వార్ జిల్లా ఆరోగ్య శాఖ కోరల్, కస్తూర్బా, సరోజిని, గోవింద్ భవన్, విజ్ఞన్ కుంజ్ పేరిట ఉన్న ఐదు హాస్టళ్లకు సీల్‌ వేసి, కంటైనర్‌ జోన్లుగా ప్రకటించింది.

ఐఐటీ రూర్కీలో సుమారు 3వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 1,200 మంది మంది ఐదు హాస్టళ్లలో ఉంటున్నారు. ప్రస్తుతం విద్యార్థులందరూ హాస్టళ్లలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థులు కరోనా బారినపడుతుండడంతో ఐఐటీకి వచ్చేందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులను తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు రావొద్దని సూచించారు. ప్రస్తుతం హాస్టళ్లలో ఉన్న విద్యార్థులందరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా.. ఉత్తరాఖండ్‌లో గురువారం కొత్తగా 787 కొవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి..

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ఒకరు మృతి
శంషాబాద్‌లో విమానాశ్రయంలో విదేశీ బంగారం పట్టివేత
రాష్ట్రానికి నేడు వర్ష సూచన
ఢిల్లీలో 37 మంది వైద్యులకు కరోనా‌
సువేందు అధికారికి ఈసీ నోటీసులు
తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు
దేశంలో కరోనా విలయం.. 24 గంటల్లో 1.31లక్షల కేసులు
‘వ్యాక్సిన్ల భద్రత’పై ప్రభుత్వ కమిటీ సమీక్ష
Advertisement
ఐఐటీ రూర్కీలో 90 మంది విద్యార్థులకు కరోనా

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement