Urvil Patel : ఐపీఎల్లో అన్క్యాప్డ్ ప్లేయర్ ఉర్విల్ పటేల్(Urvil Patel) చరిత్ర సృష్టించాడు. పంతొమ్మిదో సీజన్లో తొలిసారి బ్యాట్ ఝులిపించిన ఈ చెన్నై చిన్నోడు రికార్డు అర్ధ శతకంతో రికార్డు నెలకొల్పాడు. చెపాక్ స్టేడియంలో పూనకం వచ్చినట్టే ఆడిన ఉర్విల్.. ఏకంగా 13 బంతుల్లోనే యాభై రన్స్‌తో చెలరేగాడు. తద్వారా ఈ మెగా టోర్నీ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీతో యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) రికార్డను సమం చేశాడీ హిట్టర్.
చెపాక్ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు ఉర్విల్ పటేల్. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లను ఊచకోత కోసిన ఉర్విల్.. ఎదుర్కొన్న ఎనిమి ది బంతులను.. 1, 6, 6, 6, 6, 4, 6 గా మలిచి అర్ధ శతకానికి చేరువయ్యాడు. అవేశ్ ఖాన్, దిగ్వేజ్ రథీ బౌలింగ్‌ను తుత్తునియలు చేసిన ఉర్విల్.. షమీ, షాదాబ్‌ను ఉతికేస్తూ 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో చరిత్ర లిఖించాడు.
A record knock 🤯
A memorable celebration with a 𝗵𝗲𝗮𝗿𝘁𝗳𝗲𝗹𝘁 𝗺𝗲𝘀𝘀𝗮𝗴𝗲 🥹🫶Urvil Patel, thank you for the entertainment today 💛
Updates ▶️ https://t.co/MoXhlWHk4O#TATAIPL | #KhelBindaas | #CSKvLSG | @ChennaiIPL pic.twitter.com/GjR5D2sYid
— IndianPremierLeague (@IPL) May 10, 2026
కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)పై 2023లో యశస్వీ జైస్వాల్ నెలకొల్పిన వేగవంతమైన ఫిఫ్టీ రికార్డును ఉర్విల్ సమం చేశాడు. కమిన్స్, కేఎల్ రాహుల్, రొమారియో షెపర్డ్ 14 బంతుల్లో అర్ధ శతకంతో ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
Un-real Patel! 🤯
Joint-fastest 5️⃣0️⃣ in #TATAIPL history in just 1️⃣3️⃣ balls 👏👏
Updates ▶️ https://t.co/MoXhlWHk4O#TATAIPL | #KhelBindaas | #CSKvLSG | @ChennaiIPL pic.twitter.com/nfNE6LcNL6
— IndianPremierLeague (@IPL) May 10, 2026
యశస్వీ జైస్వాల్ (రాజస్థాన్ రాయల్స్)- 13 బంతుల్లో – కోల్‌కతాపై 2023లో.
ఉర్విల్ పటేల్ (చెన్నై సూపర్ కింగ్స్) – 13 బంతుల్లో – లక్నోపై 2026లో.
కేఎల్ రాహుల్(పంజాబ్ కింగ్స్) – 14 బంతుల్లో – ఢిల్లీ క్యాపిటల్స్‌పై 2018లో.
ప్యాట్ కమిన్స్(కోల్‌కతా నైట్ రైడర్స్) – 14 బంతుల్లో ముంబై ఇండియన్స్‌పై 2022లో.
రొమారియో షెపర్డ్(ఆర్సీబీ)- 14 బంతుల్లో – చెన్నై సూపర్ కింగ్స్‌పై 2025లో .
Urvil Patel plays an all-timer knock at the Chepauk 💥 pic.twitter.com/Stg1lbOuuN
— ESPNcricinfo (@ESPNcricinfo) May 10, 2026