Joseph Vijay : తమిళనాడులో నవశకానికి నాంది పలికిన తమిళగ వెట్రి కజగ అధినేత జోసెఫ్ విజయ్ (Joseph Vijay) ప్రమాణస్వీకారంలోనూ తన ప్రత్యేకత చాటుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయంతో నవతరం ప్రతినిధిగా అవతరించిన విజయ్.. బ్లేజర్లో వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. తనకంటే ముందు సేవలందించిన ఎంజీఆర్, కరుణానిధి, ఎంకే స్టాలిన్ ద్రవిడ సంస్కృతిని ప్రతిబింబించేలా ధోతీ, కుర్తా ధరించి సీఎంగా బాధ్యతలు చేపట్టగా.. విజయ్ మాత్రం సామాన్యుడిలా, జెన్ జీ మెచ్చే బ్లేజర్లో విచ్చేయడం చర్చనీయాంశంగా మారింది.
అసెంబ్లీ ఎన్నికల్లో తన మార్క్ ప్రసంగాలతో ఆకట్టుకున్న టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ ద్రవిడ సిద్ధాంతంతో పుట్టుకొచ్చిన అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలకు చెక్ పెట్టారు. సొంతంగా పోటీ చేసి 108 సీట్లతో టీవీకేను అతిపెద్ద పార్టీగా నిలిపిన విజయ్.. ఐదు రోజులు ఉత్కంఠ అనంతరం కాంగ్రెస్, వామపక్ష పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండూర్ స్టేడియంలో ఆదివారం ఉదయం 10 గంటలకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్.. విజయ్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకకు బ్లేజర్లో వచ్చిన విజయ్ అందర్నీ ఆశ్చర్యపరిచారు.
#WATCH | Chennai: Tamilaga Vettri Kazhagam (TVK) Chief C Joseph Vijay takes oath as the Chief Minister of Tamil Nadu. pic.twitter.com/8yGuYEAkfj
— ANI (@ANI) May 10, 2026
ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే తాను మీలో ఒకడిని, సామాన్యుడిని అనే సందేశాన్ని మరోమారు చాటుతూ ఆధునిక ఆహార్యాన్ని ఎంచుకున్నారు. తద్వారా ఆనవాయితీగా తమిళ ముఖ్యమంత్రులు పాటించిన సంప్రదాయ ధోతీ, కుర్తాను కాదని.. తన ప్రమాణ స్వీకారం నుంచే మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో బ్లేజర్‌ను ధరించారు విజయ్. ఎంజీఆర్ అనంతరం రాజకీయ పార్టీ పెట్టి.. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తొలి సినిమా నటుడిగా రికార్డు నెలకొల్పిన టీవీకే బాస్ తాను ఒక సామాన్యుడిని అనే భావనను ప్రజల్లో కలిగించారు.
This is MK Stalin CM ceremony……
First song is #National anthem
Second song #tamilthaai vazhthu #TVKVijay #DMK pic.twitter.com/ZWrWhXXneE— Rahman (@Rahmanabdul001) May 10, 2026
‘నేను దేవదూతను కాదు. నేను మీలానే సామాన్య మనిషిని. కానీ, జనం నాకు మద్దతుగా నిలబడడంతో మనం ఏదైనా సాధించగలమనే నమ్మకం నాకు కలిగింది. నాకు ఆకలి, పేదరికం తెలుసు. నేను రాజకుటుంబంలో జన్మించలేదు. నేను మీలో ఒకడినే. అసిస్టెంట్ డైరెక్టర్ కుమారుడినైనా నేను సినిమాల్లో విజయవంతమయ్యాను’ అని పార్టీ కార్యకర్తలు, అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య సీఎంగా తొలి ప్రసంగంలో పేర్కొన్నారు విజయ్. బ్లేజర్ లుక్‌తో తాను చేతల ముఖ్యమంత్రిని అని చాటుకున్నారాయన.
ద్రవిడ సంప్రదాయ దుస్తుల్లో ఎంజీఆర్

విజయ్ కంటే ముందు సీఎంలుగా సేవలందించిన ఎంజీఆర్, కరుణానిధి, స్టాలిన్లు తెల్ల చొక్కా, ధోతీ ధరించి ప్రమాణస్వీకారం చేశారు. కానీ, తమిళనాట ట్రెండ్ సెట్టరైన టీవీకే అధినేత మాత్రం సీఎం కుర్చీలో కూర్చోవడానికి ముందే తన డ్రెస్సింగ్‌తో మార్పు దిశగా అడుగులు వేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.