లక్నో: టీచర్‌గా పని చేస్తున్న వ్యక్తి అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఒక చోట దోపిడీకి ప్రయత్నించాడు. గన్ గురిపెట్టిన అతడు డబ్బులు ఇవ్వమని బతిమిలాడాడు. అక్కడి నుంచి పారిపోతుండగా జనం పట్టుకుని పోలీసులకు అప్పగించారు. (teacher points gun, begs for money) ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఈ సంఘటన జరిగింది. శనివారం రాత్రి 8 గంటల సమయంలో కాజీ సరాయ్ ప్రాంతంలోని కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ)కు ఒక వ్యక్తి చేరుకున్నాడు. తలకు హెల్మెట్ ధరించిన అతడు గ్రిల్ నుంచి సీఎస్సీ ఆపరేటర్ జావేద్ అలీకి తుపాకీ గురిపెట్టాడు. ‘నేను చాలా అప్పు చేశాను. నాకు రూ. 10,000 ఇవ్వండి’ అని పలుమార్లు వేడుకున్నాడు.
కాగా, సీఎస్సీ ఆపరేటర్ జావేద్ అలీ అప్రమత్తం కావడంతో ఆ వ్యక్తి బయటకు పరుగెత్తాడు. అయితే రోడ్డుపై ఉన్న జనం అతడ్ని పట్టుకుని కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. వారణాసిలోని భరత్పూర్ గ్రామానికి చెందిన గౌతమ్ పటేల్‌గా గుర్తించారు. ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా అతడు పనిచేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు.
మరోవైపు పెరుగుతున్న అప్పులు, నెలవారీ వాయిదాల కారణంగా తాను తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్నట్లు గౌతమ్ పోలీసులకు తెలిపాడు. అందుకే దోపిడీకి ప్రయత్నించినట్లు అతడు చెప్పాడు. దీంతో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద ఉన్న పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అతడి వద్దకు పిస్టల్ ఎలా చేరింది, గతంలో కూడా ఇలాంటి దోపిడీలు చేశాడా? అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. అయితే సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
🚨Bank Heist: Brave Locals Foil Pistol-Wielding Robber in Varanasi
In a swift and courageous act, residents of Kaji Sarai (Harhua), Varanasi foiled an attempted armed robbery at a Common Service Centre (CSC) on Saturday night around 8 PM.
The miscreant entered the centre on a… pic.twitter.com/LwHNvxs9rS
— Ramesh Tiwari (@rameshofficial0) May 10, 2026