Tarun Tejpal: జూనియర్ను రేప్ చేసిన కేసులో దోషిగా తెహల్కా మాజీ ఎడిటర్
Tarun Tejpal: జూనియర్పై అత్యాచారం చేసిన కేసులో తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ను బాంబే హైకోర్టుకు చెందిన గోవా బెంచ్ దోషిగా తేల్చింది. ఓ హోటల్ ఎలివేటర్లో జూనియర్పై లైంగిక దాడి చేసినట్లు తేజ్పాల్పై ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ మధ్యాహ్నం ఈ కేసులో శిక్షను ఖరారు చేయనున్నారు.
పనాజీ: తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్(Tarun Tejpal).. లైంగిక ఆరోపణల కేసులో దోషిగా తేలారు. 2013 నాటి కేసులో బాంబే హైకోర్టుకు చెందిన గోవా బెంచ్ ఇవాళ తీర్పును ఇచ్చింది. జూనియర్ ఉద్యోగినిని ఓ హోటల్లో రేప్ చేసినట్లు తరుణ్ తేజ్పాల్పై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసులో 2021లో ట్రయల్ కోర్టు తేజ్పాల్ను నిర్దోషిగా తేల్చింది. కానీ ఆ తీర్పును గోవా ప్రభుత్వం సవాల్ చేసింది. జస్టిస్ డాక్టర్ నీలా గోఖలే, అమిత్ జామ్సందేకర్తో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసును విచారించింది. ఇరు పక్షాల వాదనలు విన్నతర్వాత తీర్పును వెలువరించారు. సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించారు.
తరుణ్ తేజ్పాల్ తరపున సీనియర్ న్యాయవాది అబాద్ పోండా వాదించారు. సంస్థలో పనిచేస్తున్న మాజీ జూనియర్ ఉద్యోగిని తేజ్పాల్పై కేసు బుక్ చేసింది. 2013లో గోవాలో జరిగిన థింక్ఫెస్ట్ ఈవెంట్ సమయంలో జర్నలిస్టు తేజ్పాల్ తనను హోటల్ ఎలివేటర్లో లైంగికంగా వేధించినట్లు ఆమె ఆరోపించారు.2017లో మపూసా ట్రయల్ కోర్టులో విచారణ మొదలైంది. 2021లో తేజ్పాల్ దోషిగా తేలాడు. తీర్పు తర్వాత తేజ్పాల్ స్పందిస్తూ తనను బాధితుడిగా మార్చేశారని, తన వయసు 62 ఏళ్లు అని, కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి సమయం ఇవ్వాలని కోరారు. ఇవాళ మధ్యాహ్నం కోర్టు శిక్షను ఖరారు చేయనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

