న్యూఢిల్లీ : ముంబైలో టెర్రిరిస్టులను గడగడలాండిన ఎన్ఎస్జీ మాజీ చీఫ్.. కరోనా వైరస్‌కు లొంగిపోయి తుదిశ్వాస విడిచారు. ముంబైలో 26/11 కౌంటర్-టెర్రర్ ఆపరేషన్స్‌కు నాయకత్వం వహించిన ఎన్ఎస్జి మాజీ చీఫ్ జ్యోతికిషన్ దత్ కోవిడ్‌కు గురై బుధవారం సాయంత్రం కన్నుమూశారు. ఈ విషయాన్ని నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
కొవిడ్ సంబంధిత సమస్యల కారణంగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఎన్ఎస్జీ మాజీ డీజీ జ్యోతికిషన్ దత్ వారం రోజుల క్రితం గుర్గావ్లోని మేదంత దవాఖానలో చేరారు. కాగా బుధవారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
జేకే దత్ పశ్చిమ బెంగాల్ క్యాడర్‌కు చెందిన 1971 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి. సీబీఐ, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళంలో వివిధ పదవుల్లో పనిచేశారు. సీబీఐలో ఉన్న సమయంలో చాలా సున్నితమైన కేసులను డీల్ చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి చరిత్రలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. జేకే దత్ సేవలకు గుర్తింపుగా గ్యాలంట్రీ పోలీసు పతకం, మెరిటోరియస్ పోలీసు పతకం, విశిష్ట సేవ కోసం రాష్ట్రపతి పోలీసు పతకాన్ని అందుకున్నారు.
Sh Jyoti Krishan Dutt IPS ,former DG NSG ( Aug 2006- Feb 2009) passed away today on 19th May at Gurugram. NSG condoles the sad and untimely demise of former DG and remembers his distinguished service to the Nation . pic.twitter.com/qhBj4JnjwB
— National Security Guard (@nsgblackcats) May 19, 2021
అహ్మదాబాద్‌లో కుప్పకూలిన ఐదంతస్థుల భవనం.. వీడియో
నేపాల్‌లోని దౌలాఖా జిల్లాలో చైనా ఆక్రమణలు
సముద్ర పర్యవేక్షణకు ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా
మార్స్‌పై ‘మర్మ రాయి’ని కనుగొన్న నాసా రోవర్
జూన్ 1 నుంచి లాక్డౌన్ ఎత్తివేతకు నిర్ణయం
పాలస్తీనాకు అన్ని రకాల సాయం: పాక్ నిర్ణయం
మరో చిప్కో ఉద్యమం.. ఎంపీలో ‘సేవ్ బక్స్వాహా ఫారెస్ట్’
బ్రిటన్ అన్‌లాక్ : కలకలలాడుతున్న ఎయిర్‌పోర్ట్స్, రెస్టారెంట్స్
పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేయాలన్న పిటిషన్ తోసివేత
నటి మెర్కెల్‌ను వివాహమాడిన ప్రిన్స్ హ్యారీ.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..