Praja Palana | జహీరాబాద్ , ఏప్రిల్ 2 : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక వార్డు సభల్లో పట్టణ 27వ వార్డు కౌన్సిలర్ కాటా స్రవంతి ప్రజల గొంతుకగా నిలిచారు. గురువారం జహీరాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆవరణలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 27వ వార్డు సభలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన ఆ నామ స్రవంతి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన అభయహస్తం హామీలు నేడు అటకెక్కాయని విమర్శించారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పేదలు తమ హక్కుల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి మహిళకు ఇస్తామన్న 2500 ఇప్పటివరకు అతీగతీ లేదని, ఇది మహిళా లోకాన్ని వంచించడమేనని మండిపడ్డారు.
జహీరాబాద్ మున్సిపాలిటీలో వెయ్యికి పైగా వితంతు, వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రారంభంలో వచ్చిన ఉచిత విద్యుత్ ఇప్పుడు సాంకేతిక కారణాలతో చాలా మందికి అందడం లేదని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై స్పష్టత లేదని, అలాగే 500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావడం లేదని నిలదీశారు. గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే అదనంగా తులం బంగారం ఇస్తామన్న హామీ ఎప్పుడు నెరవేరుతుందని ప్రశ్నించారు.
ప్రజల పక్షాన పోరాటం వార్డ్ సభల పేరుతో కాలయాపన చేయకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఆమె అధికారులను కోరారు. 27వ వార్డు ప్రజల ప్రతినిధిగా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం నా బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖను వాడు ప్రత్యేక అధికారికి అందజేశారు.
Ganneruvaram | ఎమ్మెల్యే కవ్వంపల్లి తీరుకు నిరసనగా గన్నేరువరం గ్రామ సభలో కంకర తట్టతో వినూత్న నిరసన
‘సమస్యల పరిష్కారానికే ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’
‘ఐటీసీ చర్చలకు రాకపోతే పోరాటం మరింత ఉధృతం’
కిన్నెరసాని వాగు నుండి ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత