నార్నూర్ : ప్రభుత్వ పథకాలను ( Government Schemes ) సద్వినియోగం చేసుకోవాలని డివిజన్ పంచాయతీ అధికారి ప్రభాకర్ (DLPO Prabhakar) అన్నారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాది గూడ మండలంలోని 48 గ్రామపంచాయతీ కార్యాలయాలలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక గ్రామసభను సర్పంచుల అధ్యక్షతన గురువారం నిర్వహించారు.
ఈ గ్రామ సభలో ప్రభుత్వ పథకాలు, సంక్షేమం తీరుపై చర్చించారు. గ్రామ సభలలో ప్రభుత్వం అమలు చేస్తున్న అరకొర పథకాల అమలు తీరుపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గ్రామసభలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఉన్నత అధికారులకు నివేదిస్తామని గ్రామసభలలో అధికారులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇన్చార్జి ఎంపీడీవో రాథోడ్ గంగా సింగ్, సర్పంచులు బానోత్ కావేరి, తోడసం రేణుక, ఉప సర్పంచ్ మహ్మద్ ఖురేషి, పంచాయతీ కార్యదర్శులు, హాయ్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.