Anil Ambani | ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani)కి మరో షాక్ తగిలింది. ఆయనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. రూ.2,929 కోట్ల మోసం కేసు (Fraud Case)లో అనిల్ అంబానీపై ఈడీ కొత్త మనీలాండరింగ్ కేసు దాఖలు చేసింది.
రూ.2,929.05 కోట్ల రుణ మోసం కేసులో (Bank Fraud Case) అనిల్ అంబానీపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఇటీవలే చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అనిల్ అంబానీపై కేసు కూడా నమోదు చేసింది. ఈ కేసులో అంబానీకి చెందిన సంస్థలపై సీబీఐ ఇటీవలే సోదాలు చేపట్టిన (CBI Raids) విషయం తెలిసిందే. సీబీఐ దాఖలు చేసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఆధారంగా తాజాగా ఈడీ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రూ.3 వేల కోట్ల రుణ మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అనిల్ అంబానీని ఇప్పటికే విచారించిన విషయం తెలిసిందే.
Also Read..
Indian tourist | ఎటుచూసినా మంటలే.. సాయం చేయండి.. నేపాల్లో భారత పర్యాటకురాలు..!
India-Nepal Border | రగులుతున్న హిమాలయ దేశం.. నేపాల్ సరిహద్దుల్లో భారత్ హై అలర్ట్
Forest Officials | అటవీ సిబ్బందిని పులికి ఎరగా బోనులో బంధించిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?